Heroine : మలయాళం లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి హానీ రోజ్(Honey Rose). ఈమె తెలుగు లో కేవలం ‘వీర సింహా రెడ్డి'(Veera Simha Reddy) అనే చిత్రం మాత్రమే చేసింది. బాలయ్య బాబు(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలో సగానికి పైగా హానీ రోజ్ మిడిల్ ఏజ్ లుక్ లోనే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆమెకి ఈ చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కుర్రాళ్ళు ఈమెను చూస్తే మెంటలెక్కిపోతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలకు లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. కొంతమంది ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తే మరి కొంతమంది మాత్రం అసభ్యంగా, చూసేందుకు చాలా చిరాకు కలిగే భాషతో కామెంట్స్ చేస్తుంటారు.
అలా హానీ రోజ్ ని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త బాగా వేధిస్తున్నాడు అంటూ నిన్న కెరలోని ఎర్నాకులం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత కొంతకాలం క్రితమే ఒక ఈవెంట్ కి హాజరయ్యానని, ఆ సమయంలో నాకు పరిచయమైనా ఆ పారిశ్రామిక వేత్త, ఆరోజు నుండి నన్ను అనుసరించడం మొదలు పెట్టాడని, తనకి అసభ్యంగా మెసేజిలు చేస్తూ, తాను ఎక్కడుంటే అక్కడికి వచ్చి వేధిస్తున్నాడని, అతను మర్యాదగా చెప్తే వినే రకం లాగా అనిపించలేదు కాబట్టే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆమె కంప్లైంట్ ని స్వీకరించిన పోలీసులు, ఆ పారిశ్రామిక వేత్త తో పాటు 27 మందిపై కేసులు నమోదు చేసారు. ఆ తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ సోషల్ మీడియా లో తనపై మీమ్స్, ట్రోల్స్, జోక్స్ చేసినా పట్టించుకోను కానీ అసభ్యంగా పోస్టులు, కామెంట్స్ చేస్తే అసలు సహించేది లేదు.
వారిపై కేసులు నమోదు చేయించి జైలు కి వెళ్ళేంత వరకు న్యాయ పోరాటం చేస్తాను అంటూ హెచ్చరించింది. దీంతో హానీ రోజ్ ఒక్కసారిగా సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె రాచెల్ అనే మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఈమధ్య ఈమె నిర్మాతగా కూడా మారింది. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకే తాను ఈ నిర్మాణ సంస్థ ని స్థాపించానని, ఈ సంస్థ లో తాను కూడా అవసరమైనప్పుడు నటిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. వీర సింహా రెడ్డి తర్వాత ఈమెకు టాలీవుడ్ లో అనేక అవకాశాలు వచ్చాయి కానీ, ఆమె మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషించాలని నిర్ణయించుకుంది. రీసెంట్ గానే ఆమె ఒక తెలుగు సినిమాకి సంతకం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.