Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా చివర్లో పవన్ కళ్యాణ్ కి హెల్ప్ చేసే ఒక క్యారెక్టర్ ఉందట. అది ఒక స్టార్ హీరోతో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు హరీష్ శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే తెలుగు హీరోలు అయితే అలాంటి పాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కాబట్టి బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోని రంగంలోకి దింపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే సల్మాన్ ఖాన్ ని ఆ పాత్ర కోసం తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆయన సినిమా చివరలో పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్ ఇవ్వనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఆ సీన్ ఈ సినిమాకి హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు రాణిస్తాడు. అలాగే సల్మాన్ ఖాన్ కి ఆ పాత్ర ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులు చూసుకుంటూనే రవితేజ ని హీరోగా పెట్టి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ఇక దాదాపు ఆయన 5 సంవత్సరాల నుంచి ఒక సినిమాని కూడా రిలీజ్ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఖాళీ సమయాన్ని ఈ రెండు సినిమాలతో ఫుల్ ఫిల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…