Homeప్రత్యేకంHyderabad Woman Starving On US: అమెరికాలో ఆకలికేక.. అలమటిస్తున్న తెలంగాణ యువతికి ఎందుకీ పరిస్థితి?

Hyderabad Woman Starving On US: అమెరికాలో ఆకలికేక.. అలమటిస్తున్న తెలంగాణ యువతికి ఎందుకీ పరిస్థితి?

Hyderabad Woman Starving On US: అమెరికా.. అవకాశాల స్వర్గం. దండిగా సంపాదించుకునేందుకు అనువైన ప్రాంతం. అందుకే చాలామంది యువత అక్కడ చదువు నిమిత్తం వెళ్తుంటారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే స్థిరపడతారు. మన దేశమే కాదు ప్రపంచంలోనే అన్ని దేశాల యువత మొదట ఎంచుకునే ప్రాంతం అమెరికా అంటే అతిశయోక్తి కాదు. అలాంటి అమెరికాకు తెలంగాణ యువతీ మాస్టర్స్ చదవడానికి వెళ్ళింది. కానీ అక్కడ ఎదురైన పరిస్థితులు ఆమెను, కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. దీంతో తన కూతురు బాధ చూడలేక ఆమె తల్లి స్పందించారు. ట్విట్టర్ వేదికగా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు లేఖ రాశారు. వెంటనే తన కూతురుని భారత్ తీసుకురావాలంటూ లేఖలో కోరారు. దీనికి సంబంధించిన లేఖను భారత రాష్ట్ర సమితి నేత ఖలికర్ రెహమాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఏం జరిగింది అంటే

హైదరాబాదులోని మౌలాలి ప్రాంతానికి చెందిన వహజ్ ఫాతిమా కూతురు సయ్యదా లులు మిన్జాజ్ జైదీ.. పై చదువుల కోసం 2021లో ఆగస్టు నెలలో అమెరికా వెళ్ళింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తన తల్లితో రోజూ మాట్లాడుతూ ఉండేది. కానీ గత రెండు నెలలుగా తన కూతుర్నించి ఎటువంటి ఫోన్లు రావడంలేదని సయ్యదా లులు మిన్జాజ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కూతురికి ఏమైందో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతోంది. అయితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన కొంతమంది సయ్యదా లులు మిన్జాజ్ ను గుర్తించి ఆ సమాచారాన్ని ఆమె తల్లికి అందించారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం సయ్యదా లులు మిన్జాజ్ వస్తువులు ఎవరో దొంగిలించారు. అప్పటినుంచి ఆమె చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. సయ్యదా లులు మిన్జాజ్ మానసిక ఒత్తిడికి కూడా గురవుతోంది. ఈ వివరాలను హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిన వారు చెప్పడంతో సయ్యదా లులు మిన్జాజ్ తల్లి కంటికి ధారగా విలపిస్తోంది. నా కూతురిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని వహాజ్ ఫాతిమా కేంద్ర వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ కు లేఖ రాశారు. ఆ లేఖలో తన కూతురుకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. కాగా ఆ యువతి ట్రైన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version