Michael Jackson: మైఖేల్ జాక్సన్ వర్ధంతి : ఆయన గురించి ఎవరికీ తెలియని పది నిజాలు

15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ గా అతని వారసత్వం కొనసాగుతోంది. సంగీత చరిత్రలో అతని స్థానం అచెంచలం. ఎందుకంటే అతని జీవితకాల రికార్డు అమ్మకాలు సుమారు 750 మిలియన్లు అని అంచనా వేయబడింది.

Written By: Neelambaram, Updated On : June 25, 2024 5:41 pm

Michael Jackson

Follow us on

Michael Jackson: మైఖేల్ జాక్సన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని ఒక స్టార్. జూన్ 25, 2009న జాక్సన్ మరణవార్తతో ప్రపంచ వినోద పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. యూకేలోని లండన్ లో జరగబోయే కచేరీలకు సిద్ధమవుతున్న సమయంలో లాస్ ఏంజిల్స్ లోని తన భవనంలో గుండెపోటుతో మైఖేల్ కన్నుమూశారు.

15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ గా అతని వారసత్వం కొనసాగుతోంది. సంగీత చరిత్రలో అతని స్థానం అచెంచలం. ఎందుకంటే అతని జీవితకాల రికార్డు అమ్మకాలు సుమారు 750 మిలియన్లు అని అంచనా వేయబడింది. ఇది అతన్ని ఆల్ టైమ్ టాప్ సెల్లింగ్ కళాకారుల్లో ఒకరిగా నిలబెట్టింది.

1958, ఆగస్ట్ 29న జన్మించిన జాక్సన్ 1972లో తన తొలి సోలో ఆల్బమ్ ను విడుదల చేశారు. నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ ఆల్బమ్ విడుదలైంది. మరుసటి సంవత్సరం, అతను బిల్లీ జీన్ ప్రదర్శిస్తూ తన మూన్ వాక్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇంతటి లెజెండ్ డ్యాన్సర్, లిరికిస్ట్, మ్యూజిషిన్ గురించి ఎవరికీ తెలియని 10 వాస్తవాలను పంచుకుందాం.

పాప్ ఐకాన్ గురించి 10 నిజాలు
* మైఖేల్ జాక్సన్ నివాసం సాధారణమైనది కాదు. అది ఒక అద్భుత ప్రదేశం, ఇందులో జూ (జంతుప్రదర్శనశాల), రోలర్ కోస్టర్లు, ఫెర్రిస్ చక్రాలు, బంపర్ కార్లు, అతని సొంత పెరట్లో రైళ్లు కూడా ఉన్నాయి.
* అప్పట్లో మైఖేల్ జాక్సన్ తన ప్రాపర్టీ కోసం 17 మిలియన్ డాలర్లు, 30 మిలియన్ డాలర్లు చెల్లించగా, నేడు దాని విలువ 100 మిలియన్ డాలర్లు.
* మైఖేల్ సోవియట్ యూనియన్ లో కూడా సూపర్ స్టార్, ఎందుకంటే అతను వారి మొదటి పాశ్చాత్య వాణిజ్య ప్రకటనలో కనిపించాడు.
* నటి ఎలిజబెత్ టేలర్ 1991లో మైఖేల్ జాక్సన్ కు 2000 కిలోల బరువున్న భారీ ఆసియా ఏనుగును బహూకరించారు.
* జాక్సన్ స్కిన్ టోన్ అనేక ప్రశ్నలను రేకెత్తించగా, కొంత మందికి సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది చర్మ పరిస్థితి కారణంగా జరిగిందని వైద్యులు వివరించారు.
*1992 ఆఫ్రికన్ పర్యటనలో, ఒక గ్రామ పెద్ద అతనికి కింగ్ సాని అనే పట్టాభిషేకం చేశాడు. అతనికి మైఖేల్ జాక్సన్ అమలమాన్ అనోహ్ అనే ప్రత్యేక ఆఫ్రికన్ పేరు ఇచ్చాడు.
* బార్బీకి కూడా ఒక పోటీదారు ఉన్నాడు. అతడే మైఖేల్ జాక్సన్. ఎందుకంటే ఒక సంస్థ యూరోపియన్ అభిమానుల కోసం మైఖేల్ జాక్సన్ బొమ్మను తయారు చేసింది. ఇది బార్బీ బొమ్మ కంటే ఎక్కువ సేలైంది.
* మైఖేల్ జాక్సన్ దాదాపు మార్వెల్ ను సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే అతను కంపెనీ దివాళా తీసినప్పుడు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు.
* మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా 66 మిలియన్ కాపీలు అమ్ముడుపోవడంతో ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది.
* మైఖేల్ జాక్సన్ ఖాతాలో గిన్సీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఆయన ఎక్కువ సంఖ్యలో ఛారిటీలను నడిపేవారు. ఒకే సంవత్సరంలో అత్యధిక గ్రామీ అవార్డులు కూడా ఆయన గెలుచుకున్నారు.

Tags