Pawan Kalyan Sensational Comments: ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అయితే ప్రజా ఉద్యమాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే అంతే అంటూ వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. చివరకు పిఠాపురం నియోజకవర్గంలో పిల్లలతో కూడా కులాల గురించి మాట్లాడిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే ఇటీవల కూటమికి ఆదరణ తగ్గుతోందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తామ అధికారంలోకి వస్తే చంపేస్తాం అంటూ హెచ్చరించిన వారు సైతం ఉన్నారు. రప్పా రప్పా అంటున్న వారు ఉన్నారు. అయితే దీనిపై తాజాగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అలా చేస్తాం అంటున్నారు. కానీ మేము అధికారంలో ఉన్నాం అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మీలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుసు అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావన తెచ్చారు. దీంతో మున్ముందు రాష్ట్రంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అటు లోకేష్ సైతం ఎవరికి ఎలాంటిప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుసు అంటూ స్పష్టం చేశారు. దీంతో ఈ ఇద్దరి నేతల మాటలు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సెగలు పుట్టిస్తున్నాయి.
ఇటీవల రెచ్చిపోతుండడంతో..
కొద్ది నెలల కిందట కూటమి ప్రభుత్వం దూకుడు మీద వ్యవహరించింది. సోషల్ మీడియాలో( social media) అనుచిత వ్యాఖ్యలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కొందరికి అయితే సరైన ట్రీట్మెంట్ నడిచింది. కానీ ఇటీవల సోకాల్డ్ వైసిపి మేధావులు, ఆపై అనుకూల సర్వేలు రావడం.. కూటమి పార్టీల్లో నేతలను పెద్దలు హెచ్చరించడంతో ఏవేవో జరిగిపోతున్నాయని ప్రచారం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో తన పాత ధోరణితో వ్యవహరిస్తోంది. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పిల్లలతో కులాల గురించి కూడా మాట్లాడించి పోస్టులు పెట్టిస్తున్నారు. కొందరైతే చంపేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఈరోజు ఆయన గట్టిగానే స్పందించారు.
సరైన ట్రీట్మెంట్ అంటూ లోకేష్ వ్యాఖ్య..
మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) సైతం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. తనదైన రీతిలో ఇప్పటికీ హెచ్చరిక ధోరణితోనే మాట్లాడుతున్నారు. మన పని మనం చేసుకు వెళ్దాం. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలుసు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అయితే లోకేష్ హెచ్చరిక ఒకవైపు.. పవన్ హెచ్చరిక మరోలా ఉంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను గుర్తు చేశారు. అక్కడ రౌడీ షీటర్లతో పాటు గ్యాంగ్ స్టార్లను ఏరి పారేశారు యోగి. బుల్డోజర్ సంస్కృతి కూడా అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు దానినే గుర్తు చేస్తూ పవన్ మాట్లాడడంతో రాష్ట్రంలో త్వరలో ఏదో జరగబోతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీ దూకుడు నేతల అరెస్టులు, కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ప్రారంభమవుతుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.