KCR family: తెలుగు రాష్ట్రాల( Telugu States) రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే పరస్పర విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నా నేతల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతుంటాయి. మరికొందరి మధ్య బద్ధ శత్రుత్వం ఉంటుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు రెండు రాష్ట్రాల మధ్య ఉంటుంది పరిస్థితి. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి చంద్రబాబు. తెలంగాణలో చంద్రబాబుకు ప్రత్యర్థి కేసీఆర్. దీంతో జగన్, కెసిఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. కెసిఆర్ కు తెలంగాణలో బద్ధ విరోధి రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితుడు. అందుకే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ పొలిటికల్ లింక్స్. అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో కేసిఆర్ అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారు రాష్ట్రాల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీఠ వేశారన్న విమర్శలు ఉన్నాయి.
పరస్పర రాజకీయ సహకారం..
2003లో తెలంగాణ( Telangana) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రేపు పోలింగ్ అనగా ఈరోజు రాత్రి నాగార్జునసాగర్ చుట్టూ ఏపీ పోలీస్ బలగాలు మోహరించాయి. అంటే అక్కడ మళ్లీ సెంటిమెంట్ రాజేసి తన మిత్రుడు కేసీఆర్ గెలవాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా విమర్శలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సహకరించారు కేసీఆర్. అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపి కేసీఆర్ను తెలంగాణలో ఓడించాలని చూశారు చంద్రబాబు. అందుకే 2019లో రిటర్న్ గిఫ్ట్ ఇదిగో అంటూ ఇచ్చారు కేసీఆర్. అయితే 2023 ఎన్నికల్లో అలా అనలేదు చంద్రబాబు. వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని పోటీ చేయించకుండా పరోక్షంగా రేవంత్ రెడ్డి గెలిచేలా చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో జగన్ పరిస్థితి మాదిరిగానే తెలంగాణలో కెసిఆర్ దుస్థితి తగలడింది. ఇద్దరికీ కుటుంబాల నుంచి ముప్పు ఉంది.
పుట్టినరోజు ఏర్పాట్లు..
రాజకీయంతో పాటు కుటుంబ పరంగా ఇద్దరు నేతలు ఇప్పుడు ఇబ్బందుల్లోనే ఉన్నారు. అందుకే పరస్పరం ఓదార్చుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. రేపు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పుట్టినరోజు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. అయితే రేపు తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పేందుకు కేసిఆర్ కుటుంబం వస్తుందని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్ తో కూడిన భారీ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. దీంతో వారు తాడేపల్లి కి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.