https://oktelugu.com/

Mufasa : The Lion King : స్టార్ హీరో డబ్బింగ్ తో ‘లయన్ కింగ్’.. ట్రైలర్ చూస్తే అదిరిపోలా.. హాలీవుడ్ లో అద్భుతం…

ఒక సినిమా మీద అంచనాలు పెంచడానికి మేకర్స్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందిస్తారు... ఇక అందులో భాగంగానే ఇప్పుడు ముఫాసా : ది లయన్ కింగ్ అనే హాలీవుడ్ సినిమా కి ఇండియాలో భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీని వాడారు....

Written By:
  • Gopi
  • , Updated On : August 12, 2024 / 09:06 PM IST

    Mufasa The Lion King

    Follow us on

    Mufasa : The Lion King : హాలీవుడ్ ఇండస్ట్రీలో ది లయన్ కింగ్ సినిమాకి చాలా ప్రత్యేకత ఉంది. ఇక ఆ సినిమాకి తెలుగులో కూడా చాలామంది వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ ‘లయన్ కింగ్’ కథ బాహుబలి కథను పోలి ఉంటుంది…2019 లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా క్యారెక్టర్ కి షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన విషయం మనకు తెలిసిందే…ఇక బాలీవుడ్ బాద్షా ఆ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడంతో సినిమా కూడా చాలా మంచి వైవిధ్యాన్ని సంతరించుకొని భారీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు వస్తున్న ముఫాసా ‘ది లయన్ కింగ్’ సినిమాలో మరోసారి షారుఖ్ ఖాన్ తన కొడుకులతో కలిసి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం విశేషం…షారుఖ్ ఖాన్ ఇద్దరు కొడుకులు అయిన.ఆర్యన్, అబ్రామ్ ఇద్దరు డబ్బింగ్ చెప్పడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నిజానికి షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాడు. హీరోగా స్టార్ డమ్ ని అందుకున్నాడు. కానీ తన కొడుకులతో కూడా డబ్బింగ్ చెప్పించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

    ఇక ‘ముఫాసా ‘ అనే సింహానికి షారుక్ ఖాన్ డబ్బింగ్ చెబితే, ‘ సింబా ‘ అనే సింహానికి ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇక అలాగే ముఫాసా చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ చిన్న సింహానికి అబ్రామ్ డబ్బింగ్ చెప్పాడు… ఇక మొత్తానికైతే ముఫాసా లయన్ కింగ్ ట్రైలర్ ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ అయి భారీ రిసర్డ్ లను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక షారుక్ ఖాన్ తన కొడుకులతో కలిసి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పాడనే విషయం తెలుసుకున్న చాలా మంది ఈ టైలర్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హాలీవుడ్ సినిమా దర్శకులు భారీ సినిమాలు తీయడంలో చాలా చక్కటి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు.

    కాబట్టి వాళ్ల నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలావరకు రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం పట్ల షారుఖ్ ఖాన్ స్పందిస్తూ డిస్నీ వాళ్లతో తనకు చాలా రోజుల నుంచి చాలా మంచి అనుబంధం ఉందని చెబుతూనే ఈ సినిమాలో నేను నా కొడుకులు కలిసి డబ్బింగ్ అనేది చాలా సంతోషంగా ఉందన్నాడు.

    ముఖ్యంగా ముఫాసా లాంటి ఒక సింహం పాత్రకి నేను డబ్బింగ్ చెబితే దాని బిడ్డ అయిన సింబ పాత్రకి నా కొడుకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పడం, అలాగే ముఫాసా చిన్నప్పటి పాత్రకి అబ్రామ్ డబ్బింగ్ చెప్పడం అనేది మాకు దక్కిన ఒక చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను అంటూ షారుక్ ఖాన్ చెప్పడం విశేషం…