India Oman trade agreement: భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా.. నూతన వాణిజ్య ఒప్పందంపై ఎటూ తేల్చడం లేదు. మరోవైపు భారత్ అమెరికా విధించే కండీషన్లను అంగీకరించడంలేదు. దీంతో భారత్–అమెరికా వాణిజ్యం ఒప్పందంపై సుదీర్ఘంగా మంతనాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా విధించిన సుంకాల భారం తప్పించుకునేందుకు కొత్త వ్యాపార మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా యూకే–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. తర్వాత ఆస్ట్రేలియాతోనూ ఒప్పందం జరిగింది. రష్యాతో కూడా ఇటీవల కుదిరిన కీలక ఒప్పందం కుదిరింది. తాజాగా ఒమాన్‌తో సమగ్ర ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌ను ఆమోదించింది.
టారిఫ్‌లేని వాణిజ్య ఒప్పందం..
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వస్తు ఎగుమతి–దిగుమతులను సులభతరం చేస్తుంది. ఒమాన్ జనాభా సుమారు 50 లక్షలే అయినప్పటికీ, భారతీయ ఉత్పత్తులపై 97.96 శాతం టారిఫ్‌లు తొలగిపోతాయి. ఒమాన్ నుంచి వచ్చే వస్తువులపై కూడా డ్యూటీలు ఉండవు. మొత్తం 10 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం భారత వ్యాపారులకు కొత్త అవకాశాలు తెరుస్తుంది.
రక్షణ, లాజిస్టిక్స్‌లో సహకారం
ఒమాన్‌లోని డు ఖ్వామ్ ఓడారవూర్తి నిలయాన్ని భారత నౌకాదళం ఉపయోగించుకునేందుకు అనుమతి లభించింది. అలాగే, రెండు దేశాలు కలిసి ’అల్ నజా’ అనే సైనిక వ్యూహాన్ని అమలు చేశాయి. ఇవి భారత్‌కు ప్రాంతీయ భద్రతలో బలపడే అవకాశం కల్పిస్తోంది.
పౌరులకు వీసా సౌలభ్యం
భారతీయులకు ఒమాన్ వీసాలు సులభంగా లభిస్తాయి. ప్రత్యేకించి, రెండేళ్ల వర్క్ వీసా విస్తరణ అనుమతితో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ చర్యలు రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి.