https://oktelugu.com/

Squid Game Season 2: ‘స్క్విడ్ గేమ్ 2’ సిరీస్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్…

హాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రపంచం లో ఎక్కడా ఎలాంటి కొత్త స్క్రిప్ట్ తో సినిమా వచ్చిన కూడా దానికి సంభందించిన బీజం మాత్రం హాలీవుడ్ లోనే పడుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 5, 2024 / 04:17 PM IST

    Squid Game Season 2 Release Date

    Follow us on

    Squid Game Season 2: హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలో ప్రతి సినిమా విషయంలో అక్కడి మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని మరి వాటిని ఒక రేంజ్ లో తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాలను నమోదు చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ల సినిమాలు విజువల్ గా చాలా గ్రాండీయర్ గా ఉంటాయి. అందువల్లే వాళ్లకి ఆస్కార్ అవార్డు కానీ, మిగతా ఇతరత్రా అవార్డులు కానీ చాలా ఈజీగా వరిస్తూ ఉంటాయి. వాళ్ల స్టాండర్డ్ తో పోల్చుకుంటే మన స్టాండర్డ్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయినప్పటికీ మన వాళ్లు కూడా ఈమధ్య భారీ సాహసాలను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హాలీవుడ్ సినిమాలకే కాకుండా సిరీస్ లకు కూడా మంచి గుర్తింపు అయితే ఉంది. 2021 వ సంవత్సరంలో వచ్చిన ‘స్క్వీడ్ గేమ్’ అనే సీరీస్ మంచి ఆదరణను దక్కించుకుంది. ఇక నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రావడంతో ఈ సిరీస్ కి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు…ఇక అందులో భాగంగానే ‘స్క్విడ్ గేమ్ 2’ పేరుతో ఈ సీరీస్ సీక్వెల్ ను కూడా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం శరవేగంగా ఈ సీరిస్ షూటింగ్ జరుపుకుంటున్న క్రమంలో 2024 డిసెంబర్ 26వ తేదీన ఈ సీరిస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ అవ్వనున్న ఈ సీరీస్ మంచి విజయాన్ని అందుకుంటుంది అనే కాన్ఫిడెంట్ తో చిత్ర యూనిట్ అయితే ఉన్నారు. ఇక మొదటి సీజన్ కంటే కూడా ఈ సీజన్ లో స్టోరీ హైలైట్ అవుతుందని దాని ద్వారా ప్రేక్షకుడు కూడా దీన్ని అమితంగా ఇష్టపడేలా ఉంటుందట. అలాగే ప్రతి సీన్ కూడా ఒక క్యూరియాసిటీని రేకెత్తించే విధంగా ఈ సినిమా ఉండబోతుందంటూ వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి వరల్డ్ వైడ్ గా సక్సెస్ సాధించాలని హాలీవుడ్ మేకర్స్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక ఇప్పటికే హాలీవుడ్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో చాలా దేశాల్లో మంచి సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అయినప్పటికీ హాలీవుడ్ వాళ్ళు తీసిన రేంజ్ మాత్రం వేరే లెవల్లో ఉంటుంది. కాబట్టి ఓటిటి ల్లో వీళ్ళకి విపరీతమైన ఆదరణ అయితే దక్కుతుంది. మొదటి పార్ట్ సక్సెస్ అయినట్టుగానే సెకండ్ పార్ట్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది అంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక 2025 వ సంవత్సరంలో సీజన్ 3 ని కూడా రిలీజ్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు…

    ఇక హాలీవుడ్ మేకర్స్ కూడా ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా సినిమాలతోనే కాకుండా సిరీస్ లతో కూడా చాలా వండర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. వాళ్ల నుంచి ఒక సిరీస్ బయటకు వచ్చిందంటే అది చాలామందికి ఇన్స్పిరేషన్ గా మారి చాలామంది మేకర్స్ అలాంటి ఒక జానర్ లోనే సిరీస్ లను చేస్తున్నారు…