Obsession Telugu Remake: రీసెంట్ గా హాలీవుడ్ లో ‘అబ్సెషన్’ అనే చిత్రం ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం 7 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగానే నడుస్తోంది , కానీ ముందుగా అనుకున్న డీల్ ప్రకారం ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ రీసెంట్ గానే రెంట్ పద్దతి లో విడుదల చేసింది.
ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని ఇప్పుడు మన టాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని చూస్తున్నారట మేకర్స్. ప్రముఖ టాప్ నిర్మాత ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు సమాచారం. ‘అబ్సెషన్’ చిత్రం లో మైఖేల్ జాన్సన్ , ఇదే నవారెత్తే హీరో హీరోయిన్లు గా నటించారు. తెలుగు వెర్షన్ లో ఈ పాత్రలను కిరణ్ అబ్బవరం , పూజ హెగ్డే చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో హీరోయినే విలన్ అనే సంగతి ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరికి తెలిసే ఉంటుంది. సూపర్ నేచురల్ పవర్ కారణంగా హీరోయిన్ అలా సైకో లాగా మారిపోతుంది. ఇలాంటి నెగెటివ్ క్యారెక్టర్ లో పూజా హెగ్డే ఎలా నటించబోతుందో చూడాలి. ఇప్పటి వరకు ఆమె గ్లామర్ రోల్స్ లోనే నటించింది.
ఆమె నటనని బయటపెట్టే బలమైన పాత్రలు ఇప్పటి వరకు చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఇంతటి భయంకరమైన నెగెటివ్ రోల్ ఆఫర్ వచ్చేసరికి ఆమె వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంగ్లీష్ లో ఉందో , తెలుగులో కూడా అలా మక్కీకి మక్కీ దింపితే ఫలితం తారుమారు అవ్వొచ్చు. అందుకే మన తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావాలని చూస్తున్నారట. డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

