Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ‘K ర్యాంప్’ సూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్న కిరణ్ అబ్బవరం , ఈ చిత్రం తో ఆ సక్సెస్ జోష్ ని ముందుకు కొనసాగించాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తుంటే , కచ్చితంగా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని చూసిన అనుభూతిని ఇచ్చేలాగానే అనిపిస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన SKN ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘ఇదొక కల్ట్ క్లాసిక్ చిత్రం’ అనే ట్యాగ్ కూడా ఇవ్వడం తో మూవీ లవర్స్ ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్ ని జారీ చేసింది. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన చిత్రం కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రం లో సెన్సార్ కట్స్ ఉంటాయని అందరూ ఊహించారు. కానీ ఒక్కటంటే ఒక్క సెన్సార్ కట్ కూడా పడలేదట. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఈమధ్య కాలం లో ఇలా జీరో కట్స్ తో వచ్చిన సినిమా లేదు. డైలాగ్స్ కూడా కేవలం యూత్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చే విధంగా రాశారట మేకర్స్. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని , వాటికి సెన్సార్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఎపిసోడ్స్ ఆడియన్స్ ని షాక్ కి గురి చేసే విధంగా ఉంటుందట.
వాటిని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతుంది. ఇక SKN చెప్పినట్టుగానే కంటెంట్ పరంగా ఇదొక కల్ట్ క్లాసిక్ లాగానే ఉంటుందట. ఈ కంటెంట్ ని ఆడియన్స్ ఇష్టపడితే మాత్రం ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి సినిమా ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది. ఈ చిత్రం విడుదలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన ‘జన నాయగన్ ‘ విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా తాకిడిని తట్టుకొని ‘చెన్నై లవ్ స్టోరీ’ నిలబడుతుందా లేదా అనేది చూడాలి.
