Telugu films Attracting Hollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాను శాసించడమే కాకుండా పాన్ వరల్డ్ లెవల్ కి దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ అయితే ఉండేది. ప్రస్తుతం హాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించకపోవడమే కాకుండా మన సినిమాలు హాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి… బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధించిన ఆయన పాన్ వరల్డ్ లో సైతం ఆ సినిమాని రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం అయితే చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. ఇక రాజమౌళితో పాటుగా అల్లు అర్జున్ (Allu Arjun) సైతం అట్లీ తో చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ కి వెళ్ళాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్న నేపథ్యంలో మనవాళ్లు చేసిన సినిమాలు అక్కడి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటే మాత్రం ఇక మన వాళ్లు డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమాలను సైతం చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు మన దగ్గర మంచి వసూళ్లను రాబట్టేవి మన సినిమాలు మాత్రం ఇతర భాషల్లోకి కూడా వెళ్లేవి కావు.
Also Read: ఐశ్వరాయ్ తో విడాకులంటూ ప్రచారం.. అభిషేక్ రియాక్షన్ ఇదే
కానీ ఇప్పుడు కాలం మారింది పాన్ ఇండియాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు ముందుకు సాగుతూ ఉండడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కొత్త పుంతలు తొక్కిస్తు ముందుకు సాగుతున్నాడు. ఇకమీదట ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించడానికి మన స్టార్ హీరోలు దర్శకులు సిద్ధమవుతున్నారు…
ఒక రకంగా రాజమౌళి వల్లే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన మొదటి పాన్ ఇండియా సినిమా చేసి మంచి పని చేశాడు. ఆయన వల్లే ఇప్పుడు చాలామంది రిస్క్ చేసి మరి పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. తద్వారా వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు.
Also Read: నిన్న మణికర్ణిక, ఇప్పుడు హరిహర వీరమల్లు.. క్రిష్ మూవీస్ మధ్యలో నుంచి ఎందుకు తప్పుకుంటున్నాడు…
ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా స్థాయిని కూడా శాసించే స్థాయికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతోంది…ఇక ఈ మధ్య వచ్చిన హాలీవుడ్ సినిమాల్లో పెద్దగా మ్యాటర్ అయితే ఉండటం…ఇక రీసెంట్ గా వచ్చిన ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది…