Why is Krish quitting movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagrlamudi)… ఈయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే విధంగా గుర్తింపునైతే తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం ఆయన అనుష్కతో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో తను తదుపరి మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఏ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా మొదట క్రిష్ డైరెక్షన్ లో స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా లేటవుతుందని సినిమా నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ సినిమాని ఏ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేయడం విశేషం…ఇక ఇప్పుడనే కాదు. క్రిష్ ఇంతకుముందు బాలీవుడ్ లో చేసిన మణికర్ణిక (Mani Karnika) సినిమా సగంలో నుంచే బయటకు వచ్చేసాడు. కారణం ఏదైనా కూడా క్రిష్ ఎందుకని ఇలా సినిమాలన్నీ సగం చేసి బయటకు వచ్చేస్తున్నాడు అనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read: మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్…
మణికర్ణిక సినిమా అర్ధాంతరంగా వదిలేయడంతో ఆ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన కంగనా రనౌత్ ఆ సినిమా మొత్తం డైరెక్షన్ చేసుకొని సినిమాను రిలీజ్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను కూడా మధ్యలో వదిలేయడం పట్ల ఆయన మీద కొంతవరకు నెగెటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది…
తను అనుకున్న సినిమాని అనుకున్నట్టుగా తీయనీయకుండా అడ్డుపడటం తో ఆయన మణికర్ణిక నుంచి బయటికి వచ్చినట్టుగా క్రిష్ గతంలో క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రావడం లేటు అవుతున్న నేపథ్యంలో తనకు రోజురోజుకీ ఇంట్రెస్ట్ పోతుందనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా క్రిష్ జాగర్లమూడి ఇలాంటి పనులు తరచుగా చేస్తూ ఉండటం వల్ల అతనికి చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…
Also Read: విడిపోతున్న నయనతార, విఘ్నేష్? వేణు స్వామి చెప్పింది నిజం కాబోతుందా?
మరి ఇక మీదటైనా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే విధంగా ఉంటే మంచిదని మరికొందరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంటే క్రిష్ మాత్రం మంచి సినిమాలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు…