Hit 3 : ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి పైరసీ భూతం మన టాలీవుడ్ ని ఎలా పట్టి పీడిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇతర ఇండస్ట్రీస్ లో కూడా కొత్తగా విడుదలయ్యే సినిమాలు, విడుదల రోజే HD ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేస్తున్నాయి. అవి ఏ రేంజ్ క్వాలిటీ తో ఉంటున్నాయంటే, సినిమా థియేట్రికల్ రన్ అయిపోయిన తర్వాత OTT లో వచ్చే ప్రింట్ ఎలా ఉంటుందో, ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే నిర్మాతలు ఎక్కడ పొరపాటు జరుగుతుందో పసిగట్టి, ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించారు. ఫలితంగా రీసెంట్ గా విడుదల అయిన సినిమాలు పైరసీ కి గురి అవ్వలేదు. ఈ భూతం నుండి టాలీవుడ్ తప్పించుకుంది, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అంతా అనుకున్నారు. కానీ నిన్న విడుదలైన ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రానికి సంబంధించిన HD ప్రింట్ ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చింది.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
అన్ని నెలలు కష్టపడి చేసిన సినిమా ఇలా విడుదల రోజే HD ప్రింట్ అందుబాటులోకి వస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేము. అయితే ఇతర నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు నిర్మాతగా నాని(Natural Star Nani) ఈ సినిమాకు తీసుకోలేదా?, లేకపోతే డుతుండగులు పైరసీ చేయడానికి కొత్త మార్గం ఏమైనా కనుక్కున్నారా?, నాని వెంటనే స్పందించి దీనిపై యాక్షన్ తీసుకోకుంటే, మళ్ళీ పైరసీ భూతం టాలీవుడ్ ని వెంటాడుతుంది. ఇప్పుడంటే మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి. రేపు ‘హరి హర వీరమల్లు’ లాంటి భారీ బడ్జెట్ సినిమా కూడా ఇలా ఆన్లైన్ లో అందుబాటులోకి వస్తే, నిర్మాతలు చాలా తీవ్రమైన నష్టాలను ఎదురుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి నిర్మాతలు శాశ్వత పరిష్కారం కన్నుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ సినిమాని నాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కష్టపడి నిర్మించడమే కాదు, ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు నాని చేసే ప్రొమోషన్స్ కూడా అద్భుతం. సినిమా మీద ఆయనకు ఉన్న ఇష్టం ఆణువణువూ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తికి అన్యాయం జరగకూడదు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ‘హిట్ 3’ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు లేక, ఖాళీగా ఉన్న థియేటర్స్, నిన్న ఈ చిత్రం తో కళకళలాడింది. మూత పడ్డ థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. నాని సినిమాకు ఇంత స్టామినా ఉంటుందా అని నిన్ననే ట్రేడ్ కి మరోసారి అర్థం అయ్యేలా చేసింది. ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, ‘హిట్ 3’ సినిమాకు కూడా అలాంటి ఓపెనింగ్స్ వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నయాట.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?