Vaibhav Surya Vamsi: ఆమధ్య ఓ క్రీడాకారిణి అంతర్జాతీయ వేదికలో జరిగిన మ్యాచ్లో మెడల్ సాధించింది. ఇక అప్పటినుంచి మొదలైంది జాతర.. ఆమె గురించి గూగుల్ ను రకరకాల ప్రశ్నలు అడిగి చుక్కలు చూపించారు నెటిజన్లు.. ఆమె ఎవరు? నేపథ్యం ఏమిటి? తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఆమె కులం? ఎవరితోనైనా ప్రేమలో ఉందా? ఆమెది ఏం గోత్రం? పెళ్లి చేసుకుంటే కట్నం ఎంతిస్తారు? ఇలా తిక్క తిక్క ప్రశ్నలు వేసి గూగుల్ తలతిన్నారు. తీరా ఆ క్రీడాకారిణి ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుంది. భర్తతో సరదాగా అన్ని ప్రాంతాలు తిరిగేస్తోంది. దీంతో ఆమె గురించి అడగడం నెటిజన్లు మానేశారు.
Also Read: నిన్న సెంచరీ..నేడు సున్నా.. పాపం సూర్యవంశీ
గూగుల్ కు చుక్కలు చూపిస్తున్నారు
ఇక ఇటీవల రాజస్థాన్ జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వడం.. అతడు సంచలనాలు సృష్టించడంతో మీడియా మొత్తం అతడి నామస్మరణ చేస్తోంది . ఇక సోషల్ మీడియా అయితే అతడి జపం మాత్రమే చేస్తోంది. ఇక వైభవ్ సూర్య వంశీ సూపర్ సెంచరీ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు అతని ఆట తీరుకు పెద్దపెద్ద ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. టీమిండియా కు డైనమైట్ దొరికాడని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అయితే సెంచరీ తర్వాత వైభవ్ సూర్యవంశీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అతనికి 10 లక్షల బహుమతి ప్రకటించింది.. ఇక ఇదే అదునుగా నెటిజన్లు వైభవ్ సూర్యవంశీ గురించి గూగుల్ లో తెగ శోధిస్తున్నారు.. వైభవ్ సూర్యవంశీ ఎక్కడ పుట్టాడు? అతని నేపథ్యం ఏమిటి? అతని వయసు, కులం, ఎక్కడ చదువుతున్నాడు, ఎంత బరువు ఉన్నాడు, కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆ స్థాయిలో సిక్సర్లు ఎలా కొట్ట గలుగుతున్నాడు, శక్తి కోసం అతడు ఏం తింటున్నాడు, అందరికీ ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమిటి, వాళ్ల నాన్న ఏం చేస్తుంటాడు, అతని ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయి, గొప్ప ఇన్నింగ్స్ ఆడుతున్నందుకు అతడు ఎక్కడ శిక్షణ తీసుకున్నాడు? వంటి ప్రశ్నలతో గూగుల్ కు విసుగెత్తించేలా చేస్తున్నారు నెటిజన్లు.. గూగుల్ అనేది గ్రూక్ లాంటిది కాదు కాబట్టి..నెటిజన్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతోంది. కాకపోతే ఆ ప్రశ్నలు మరింత తిక్క తిక్కగా ఉంటే మాత్రం.. అదే స్థాయిలో సమాధానం చెబుతోంది. ఇక సెంచరీ తర్వాత వైభవ్ సూర్యవంశీని ఇన్ స్టా గ్రామ్ లో అనుసరించే వారి సంఖ్య ఏకంగా 15 లక్షలకు పెరగడం విశేషం.
Also Read: సామ్ కరణ్ vs పంజాబ్ మేనేజ్మెంట్.. చెన్నై చెపాక్ లో ఏం జరిగింది?