HIT 3: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)… ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. ఇక నానీకి తనకు మధ్య ఉన్న మంచి రిలేషన్షిప్ వల్ల ఆయన నానికి సంబంధించిన ఏదైనా ఈవెంట్ ఉంటే హాజరవుతూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే నిన్న హిట్ 3 (Hit 3) సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. మరి ఈవెంట్లో రాజమౌళి నాని గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. నాని లో ఉన్న టాలెంట్ ను బట్టి ఆయన అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నాడు అంటూ చెప్పాడు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఈగ సినిమా నుంచి ఒక మంచి బాండింగ్ అయితే ఉందని దానివల్లే నాని అంటే చాలా అభిమానం అని కూడా ఉందని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా నాని హిట్ 3 సినిమాతో మరోసారి మరో సక్సెస్ ని సాధిస్తాడు అంటూ తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం విశేషం…
Also Read: రాజమౌళి ఫ్యామిలీ తో నాని కి అంత మంచి బాండింగ్ ఉండటానికి అదొక్కటే కారణమా..?
రాజమౌళి తర్వాత నాని మాట్లాడుతూ ఇంతకుముందు తను ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా బాలేకపోతే తన హిట్ సినిమాని చూడకండి అని చెప్పిన నాని కోర్టు సినిమా విషయంలో సక్సెస్ అయ్యాడు. కోర్ట్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పించింది. దాంతో ఆయన చేసిన శపధం వర్కౌట్ అయింది.
మరి ఇప్పుడు హిట్ 3 సినిమా కోసం ఏ సినిమాని తాకట్టు పెట్టాలి అంటూ ఆయన ఆలోచిస్తూ తన నెక్స్ట్ సినిమాకి వేరే ప్రొడ్యూసర్స్ కాబట్టి అలా తాకట్టు పెట్టడం సరైన విషయం కాదని చెబుతూనే రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి అంటూ నవ్వాడు…
దాంతో ఆ సినిమాని తాకట్టు పెట్టిన కూడా ఆ సినిమా దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాని తెలుగు లో, ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. ఆ సినిమాకి ఏ అడ్డంకి ఉండదు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటు నాని చెప్పాడు. మొత్తానికైతే ఆ సినిమాను తాకట్టు పెట్టాలనే టాపిక్ వచ్చినందుకు మహేష్ బాబు కొంత కొంతవరకు కోపానికి వస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు…