Hit 3: నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలన్ (Shailesh Kolan) దర్శకత్వంలో వస్తున్న హిట్ 3 (Hit 3) సినిమా మే ఒకటోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి షాట్ లో దర్శకుడి యొక్క విజినైతే కనిపిస్తుంది. అలాగే నాని (Nani) మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. బూతు డైలాగులను కూడా చెబుతూ ఆయన చేసిన పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందనే ధోరణిలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే నాని అభిమానులు సైతం ఈ సినిమా కోసం 1000 కన్నులతో ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే నాని హీరోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొదటి రోజు ఈ సినిమాకి 12 నుంచి 15 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నాని లాంటి స్టార్ హీరో ఇప్పుడిప్పుడే మాస్ హీరోగా మారే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
Also Read: బాలయ్య చేయాల్సిన సినిమాను చిరంజీవి ఎందుకు చేశాడు..?
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసర (Dasara) సినిమాతో మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకున్న నాని వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodha Shanivaaram) సినిమాలో కూడా మాస్ హీరోగా ప్రశంశలను అందుకునే ప్రయత్నం చేశాడు.
ఇక ఇప్పుడు హిట్ 3 సినిమాతో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించి మరోసారి తనలో ఉన్న వైలెన్స్ ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘శ్రీకాంత్ ఓదెల’ దర్శకత్వంలో చేస్తున్న ‘ప్యారడైజ్ ‘ (Paradaise) సినిమాతో తనను తాను మాస్ హీరోగా మార్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటికి ఆ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా సినిమా మీద ఒక్కసారిగా భారీ హైప్ ను కూడా పెంచాయి.
మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే నాని మాస్ హీరోగా మారాలి అనుకుంటున్న తన కలలు ఫుల్ లెంత్ లో సక్సెస్ అవుతాయని చెప్పడంలో ఎంతవరకు అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడు అనేది…
Also Read: మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ సినిమాను చేయడం వల్లే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడా..?