Pahalgam Attack: ఐదుగురు పర్యాటకుల ప్రాణాలను కాపాడినందుకు టూరిస్ట్ పోనీ స్టాండ్ అధ్యక్షుడు రయీస్ అహ్మద్ భట్‌ను ‘హీరో ఆఫ్ పహల్గామ్’గా సత్కరిస్తున్నారు. బైసరన్ లోయలోని దాడి ప్రదేశంలో దుర్బలంగా ఉన్న గాయపడిన పర్యాటకులకు అతను తన ప్రాణాలను లెక్క చేయకుండా సహాయం చేశాడు. దాడి చేసిన వాళ్ళు అక్కడే ఉండి తను కూడా చనిపోయినా పర్వాలేదు అనుకొని భట్ తన కార్యాలయం నుంచి ఒంటరిగా బయటకు వచ్చి పర్యాటకులకు సహాయం చేశాడు. ఇంతకీ ఈయన ఎవరు? అనే వివరాలు తెలుసుకుందాం.
Also Read: పాకిస్తాన్‌లో మొదలైన భారత్ ఆంక్షల ప్రభావం.. మందులు లేక మొత్తుకుంటున్న రోగులు!
అయితే తాజాగా ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ జరిగిన సంఘటనను మేము ఖండిస్తున్నాము. నిన్న మేము పెద్ద నిరసన కూడా నిర్వహించాము. కాశ్మీర్‌లో ఇలాంటి సంఘటనలు జరగకూడదని మేము కోరుకుంటున్నాము, ఎందుకంటే కాశ్మీర్ 99% పర్యాటకంపై ఆధారపడి ఉంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు, మేము మా జీవనోపాధిని పొందుతాము. సంఘటన సమయంలో భయపడిన వారిని మేము రక్షించాము. దారితప్పిన వారిని కూడా మేము రక్షించాము అన్నారు రయీస్.
ఈ సంఘటన గురించి భట్ కు సమాచారం అందిన వెంటనే, అతను 6 మంది స్థానిక కార్మిక వర్గ కాశ్మీరీలను తనతో పాటు సేకరించి పర్యాటకులపై దాడి జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. “ఈ సంఘటన జరిగినప్పుడు, ఆయన తన ఆఫీసులో కూర్చుని ఉన్నాడట. మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో, వారి యూనియన్ జనరల్ సెక్రటరీ నుంచి సందేశం వచ్చిందట. సందేశం చూసిన వెంటనే కాల్ చేస్తే నెట్‌వర్క్ సమస్య ఉందని తేలిందట. సో వాయిస్ స్పష్టంగా లేదు. కాబట్టి, బయటకు ఒంటరిగా వెళ్ళాడట. దారిలో, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను చూసి తనతో రమ్మని అడిగాడట. మొత్తం మీద, వారు ఐదారుగురు వ్యక్తులు వెళ్లి అందరికీ సహాయం చేయడానికి పూనుకున్నారు.
ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశానికి చేరుకునేసరికి, ప్రజలు బురదలో చెప్పులు లేకుండా పరిగెడుతూ సహాయం కోసం కేకలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యక్తులను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. భయపడి అలసిపోయిన పర్యాటకులకు దాహం తీర్చడానికి నీళ్లు ఇచ్చి సహాయం చేశారు. అడవి నుంచి వచ్చే నీటి సరఫరా నుంచి పైపును పగలగొట్టి, వారికి నీళ్ళు ఇచ్చి, వారిని ఓదార్చారు. ఆ తర్వాత వారికి ఇప్పుడు మీరు సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారు భయపడవద్దు అని ధైర్యం చెప్పారట.
పర్యాటకులు భయపడుతున్నప్పటికీ, హింసాకాండ జరిగిన ప్రదేశాన్ని సందర్శించడానికి స్థానిక పోనీ రైడర్లను ఒప్పించానని భట్ అన్నారు. అయితే చాలా మంది గుర్రపు స్వారీ చేసేవారు భయంతో కిందకు వచ్చారట. వారిలో 5-10 మందిని తనతో తిరిగి రమ్మని చెప్పారట. సంఘటనా స్థలానికి చేరుకున్న భట్, ఒక మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడట. తన 35 సంవత్సరాల జీవితంలో, పహల్గామ్‌లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని విచారం వ్యక్తం చేశారు.
చుట్టూ మృతదేహాలు పడి ఉన్నాయని, మొత్తం 26 మంది మరణించారని ఆయన అన్నారు. ” మొదట చూసినది ప్రధాన ద్వారం వద్ద, పర్యాటకులు ప్రవేశించే ప్రవేశ ద్వారం వద్ద ఒక మృతదేహం చూసి షాక్ అయ్యారట. ఆ తర్వాత లోపలికి వెళ్తుంటే ప్రతిచోటా మృతదేహాలు కనిపించాయట. తమ భర్తలను రక్షించమని వేడుకుంటూ మమ్మల్ని పట్టుకున్న ముగ్గురు, నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారట. బరువెక్కిన హృదయంతో, బలవంతంగా లోపలికి వెళ్ళారట. అప్పటికి మధ్యాహ్నం 3:20 గంటల అయిందట.
Also Read: జాతీయ భద్రత దృష్ట్యా మీడియాకు మోదీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు