Hit 3 Director : శైలేష్ కొలను టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన హిట్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణ రాబట్టింది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన శైలేష్ కొలను దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. హిట్ పేరుతో 2020 క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించాడు. నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ విజయం అందుకుంది. అనంతరం హిట్ 2 టైటిల్ తో మరో చిత్రం తెరకెక్కించారు. హిట్ 2లో అడివి శేష్ హీరోగా చేశారు. హిట్ 2 సైతం సక్సెస్ అయ్యింది.
Also Read : ‘హిట్ 4’ సెట్స్ మీదకి వచ్చేది అప్పుడేనా..?
శైలేష్ కొలను మూడో చిత్రం సైంధవ్ తెరకెక్కించాడు. వెంకటేష్ 75వ చిత్రంగా ఈ మూవీ రూపొందింది. నెగిటివ్ షేడ్స్ తో కూడిన వైలెంట్ రోల్ చేశాడు వెంకటేష్. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన సైంధవ్ నిరాశపరిచింది. వెంకటేష్ కి ల్యాండ్ మూవీ అవుతుంది అనుకుంటే ప్లాప్ గా మిగిలిపోయింది. హిట్ 3 మూవీతో శైలేష్ కొలను తిరిగి ఫార్మ్ లోకి వచ్చాడు. నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తుంది. రెండు రోజులకు హిట్ 3 వరల్డ్ వైడ్ రూ. 65 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.
రెండు రోజుల్లోనే 50 శాతం వరకు రికవరీ చేసిన హిట్ 3 విజయం వైపుగా దూసుకెళుతుంది. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ఈ మూడో చిత్రం సైతం ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. శైలేష్ కొలను తన తదుపరి చిత్రం వెంకటేష్ తో చేయాలని భావిస్తున్నారట. సైంధవ్ రూపంలో వెంకటేష్ కి ప్లాప్ ఇచ్చిన శైలేష్ కొలను మంచి హిట్ ఇచ్చి, రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాడట. అయితే వెంకటేష్ అందుకు ఆసక్తిగా లేడని సమాచారం.
ఆయన చూపు త్రివిక్రమ్ వైపు ఉందట. ఫ్యామిలీ కథలను కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అయిన త్రివిక్రమ్ తో మూవీ చేస్తే తనకు హిట్ ఖాయం అనుకుంటున్నాడట. వెంకటేష్ కి ఉన్న ఇమేజ్ రీత్యా త్రివిక్రమ్ తో మూవీ పడితే బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ రచయితగా పని చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా ఉన్నారు. ఆ రెండు వెంకటేష్ కి మంచి విజయాలు అందించాయి. త్రివిక్రమ్-వెంకీ కాంబోలో మూవీ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.