Star Heroine: ఇటీవలే కోట్ల రూపాయలు ఆస్తి ఉన్న స్టార్ హీరోని పెళ్లి చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ లో నిలుస్తుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ అక్కినేని నాగచైతన్య భార్య శోభిత దూళిపాల. నాగచైతన్య, శోభిత దూళిపాల ప్రేమించుకుని గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత శోభిత ధూళిపాలకు సంబంధించిన అనేక విషయాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్యతో ఆమె ప్రేమ, పెళ్లి మొదలుకొని ఆమె కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కెరియర్ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న శోభితా ధూళిపాల సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె స్కిన్ టోన్ కు సంబంధించి అలాగే ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో కెరియర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె సినిమాలలో అలాగే వెబ్ సిరీస్ లలో బోల్డ్ రోల్స్, లిప్ లాక్ సన్నివేశాలతో అందరిని పిచ్చెక్కించింది.
Also Read: భారతదేశంలో AI విప్లవం.. రోజువారీ జీవితంలో ఆధిపత్యం
శోభిత ధూళిపాల మే 31, 1993లో వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు జన్మించింది. శోభిత ధూళిపాల ది బ్రాహ్మణ కుటుంబం. వైజాగ్ లో ఈమె లిటిల్ ఏంజిల్స్ స్కూల్ అలాగే వ్యాలీ స్కూల్లో చదివింది. ఆ తర్వాత ముంబైలో ఉన్న యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో చదువు పూర్తి చేసింది. ముంబైలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే శోభిత ధూళిపాల మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ సమయంలో మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొనే. 2013 లో జరిగిన సెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న శోభిత ధూళిపా రన్నరప్ గా నిలిచింది. ఇక తర్వాత శోభిత 2016లో రిలీజ్ అయిన రామన్ రాఘవన్ 2.0 సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత అమెజాన్ ప్రైమ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ తో 2019లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

ఆ తర్వాత మేజర్, పొన్నియాన్ సెల్వన్ 1,2, ది నైట్ మేనేజర్ వంటి సినిమాలలో నటించి నటనపరంగా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ మధ్యకాలంలో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత దూళిపాల మరింత ఫేమస్ అయ్యింది. అయితే చైతుకు ఇదివరకే హీరోయిన్ సమంతతో పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక శోభిత ధూళిపాలకు మాత్రం ఇది ఫస్ట్ మ్యారేజ్. సామాజిక మాధ్యమాలలో నాగచైతన్య రెండో భార్యగా వచ్చిన శోభిత ధూళిపాలపై అనేక నెగిటివ్ కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయంపై స్పందించిన నాగచైతన్య ఇందులో శోభితా ధూళిపాల తప్పు లేదంటూ క్లారిటీ కూడా ఇచ్చారు.