Nithin : జయం(Jayam) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు నితిన్ (Nithin)…మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఇక ఒకానొక సందర్భంలో నితిన్ కి 13 ఫ్లాప్ సినిమాలు అయితే వచ్చాయి. కానీ ఆల్మోస్ట్ ఆయన కెరియర్ అయిపోయింది అనుకున్న సందర్భంలో ‘ఇష్క్'(Ishq) సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నప్పటికి ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడు. దానివల్ల ఆయన కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన చేస్తున్న సినిమాలు అతనికి ఏమాత్రం సక్సెస్ లను ఇవ్వడం లేదు. ఒక్క సక్సెస్ సాధిస్తే నాలుగు ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి.
Also Read : రాబిన్ హుడ్ ఫుల్ మూవీ రివ్యూ…
తద్వారా ఆయన ఎలాంటి హీరోగా మారతాడు అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వెంకి కుడుముల ( Venky Kudumula) దర్శకత్వంలో రీసెంట్ గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ (Robin Hud) సినిమా సైతం డిజాస్టర్ ను మూటగట్టుకోవడం అతనికి భారీ మైనస్ గా మారింది. మరి ఇప్పుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ ‘ (Yellamma) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కనక తేడా కొడితే మాత్రం నితిన్ కెరీర్ అనేది పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోతుంది. కాబట్టి ఇక మీదట ఆయన చేయబోయే స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి మరి సినిమాను సెలెక్ట్ చేసుకుంటే మంచిదని కొంతమంది సినిమా మేధావులు సైతం నితిన్ కి సలహాలు ఇస్తున్నారు. మరి ఆయన మాత్రం కథలేమి వినకుండా కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అసలైన సమయం అయితే వచ్చింది. ఈ సినిమాతో నితిన్ సినిమాలు చేయాలా వద్దా అనేది కూడా ప్రేక్షకులు డిసైడ్ చేయడానికి సిద్ధమవుతున్నారు…
నిజానికి నితిన్ సినిమాలో పెద్ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే ఏమి ఉండదు. ఒక రొటీన్ సినిమా స్టోరీ ని తీసుకొని దానికి కమర్షియల్ టచ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇంతకుముందు భీష్మ లాంటి సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించినప్పటికి ఆ రెంజ్ సక్సెస్ ను మాత్రం మరోసారి అందుకోలేకపోతున్నాడు.
Also Read : నితిన్ భార్య షాలిని చిరంజీవికి బంధువు అవుతుందనే విషయం మీకు తెలుసా?