Heroines As CM Daughter In Laws: సినీ తారలు అంటేనే ప్రజల్లో తరగని అభిమానం ఉంటుంది. ఇక హీరోయిన్లకు కూడా చాలామంది అభిమానులు ఉంటారు. ఈ అభిమానాన్ని బేస్ చేసుకుని చాలామంది సినిమాల తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఓ వెలుగు వెలిగారు. కొంత మంది ముఖ్యమంత్రులుగా రాణిస్తే.. మరొకొందరు ముఖ్యమంత్రుల భార్యలుగా, సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జయలలిత గురించి. ఆమె సినిమాల్లో రారాణిగా వెలుగొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తిరుగులేని శక్తిగా ఎదిగారు. రెండు సార్లు తమిళ సీఎంగా పని చేశారు. ఆమె పేరు ఇప్పటికీ తమిళ రాజకీయాల్లో ఓ పెద్ద ఆయుధమే. ఆమె ప్రవేశ పెట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అని మనందరికీ తెలిసిందే.

ఇక మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు కూడా మన టాలీవుడ్ హీరోయిన్. మాజీ సీఎం కుమార స్వామి భార్య రాధిక ఒకప్పుడు కన్నడలో స్టార్ హీరోయిన్. ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే కుమార స్వామితో పెండ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరికి ఒక పాప ఉంది. కాగా ఆమె కుమార స్వామి వ్యాపారాలను చూసుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read: రేపు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్

ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన జెనీలియా కూడా మాజీ సీఎం కోడలు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఆమె బాలీవుడ్ లో తుఝే మేరీ కసమ్ మూవీలో ఆఫర్ వచ్చింది. అందులో హీరోగా రితేష్ దేశ్ ముఖ్ చేస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య సన్నిహిత్యం ప్రేమకు దారి తీసింది. ఇరువురి కుటంబాల అంగీకారంతో వారు పెండ్లి చేసుకున్నారు. రితేష్ దేశ్ ముఖ్ తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ మహారాష్ట్రకు సీఎంగా కూడా పనిచేశారు. ఇక మొన్న కూడా మెహ్రీన్‌కు హర్యానా మాజీ సీఎం మనువడితో పెండ్లి నిశ్చయం అయి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అది కుదిరితే ఆమె కూడా మాజీ సీఎం ఇంటికి కోడలు అయి ఉండేది.

Also Read: భీమ్లానాయక్ ప్రభావం గట్టిగానే కనిపించింది !