Homeఎంటర్టైన్మెంట్Nanditha Raj: 'ప్రేమ కథా చిత్రమ్' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..? ఇప్పుడు ఆమె ఎక్కడుందో, ఏమి...

Nanditha Raj: ‘ప్రేమ కథా చిత్రమ్’ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..? ఇప్పుడు ఆమె ఎక్కడుందో, ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Nanditha Raj: తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న కొంతమంది హీరోయిన్స్ ని చూసి, భవిష్యత్తులో వీళ్లకు తిరుగులేదు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేనికైనా అదృష్టం ఉండాలి, టాలెంట్, అందం ఉంటే సరిపోదు. అదృష్టం ఉంటే ఆ రెండు లేకపోయినా కూడా ఇండస్ట్రీ లో నెట్టుకొని రావొచ్చు. ఇది వరకు మనం అలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాము. అలాంటి ఉదాహరణలలో ఒకటిగా మిగిలిపోయింది ‘ప్రేమ కథా చిత్రమ్’ హీరోయిన్ నందితా రాజ్ సినీ కెరీర్. ఈమె ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ అనే చిత్రమ్ ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ, నందిత రాజ్ లో మంచి నటన, అందం ఉండడంతో ‘ప్రేమ కథా చిత్రమ్’ లో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి మొదటి కారణం నందిత రాజ్ నటన అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అందుకే ఆమెకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. రెండవ సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిందంటే ఆమె టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకు మలయాళం లో పృథ్వీ రాజ్ సుకుమార్ నటించిన ‘లండన్ బ్రిడ్జ్’ అనే చిత్రంలో హీరోయిన్ నటించే అవకాశం దక్కింది. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె తెలుగు లో ‘లవర్స్’ అనే చిత్రం చేసింది. ఇది కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఆమెకి ఆ తర్వాత ఫ్లాప్స్ రావడం మొదలైంది. మధ్యలో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ, నందిత రాజ్ కి పెద్దగా గుర్తింపు తీసుకొని రాలేదు. ఈమె వెండితెర మీద చివరిసారిగా కనిపించిన చిత్రం ‘విశ్వామిత్ర’. 2019 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

ఇక ఆ తర్వాత ఈమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. అసలు ఈ అమ్మాయి ఏమైంది?, ఎక్కడ ఉంది?, ఏమి చేస్తుంది అనే విషయం ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉండడం చాలా తక్కువ. అయితే ఈమె గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా, ఈమె సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి మాస్టర్స్ చదివేందుకు విదేశాలకు వెళ్లిందని తెలుస్తుంది. అయితే ఈమెకు ఇంస్టాగ్రామ్ లో ఒక అకౌంట్ ఉంది, కానీ యాక్టీవ్ గా లేదు. అయితే రీసెంట్ గానే ఆమె నాలుగు రోజుల క్రితం కొన్ని ఫోటోలు అప్లోడ్ చేసింది. అప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చిందో మీరే చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper
Exit mobile version