https://oktelugu.com/

Buttermilk : మజ్జిగలో వంటింట్లోని ఈ రెండూ కలిపి తాగితే మలబద్దకం హుష్ పటాక్.. కడుపు ఖాళీ చేసేస్తుంది

ఈ రోజుల్లో మలబద్ధక సమస్య చాలా మందిని వేధిస్తుంది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మలం విసర్జించేటప్పుడు తీవ్ర నొప్పితో పాటు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయంటే మీరు ఈ సమస్యతో బాధ పడుతున్నట్టే. ఈ సమస్య ఉంటే ఫ్రీ మోషన్ రాదు. వీళ్లు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే మల విసర్జనకి వెళ్తుంటారు. అయితే రోజు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫైబర్ రిచ్ ఆహారాల్ని చేర్చడం వల్ల ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. మలబద్ధక సమస్యతో బాధపడేవారి కోసం ఓ సూపర్ ఫుడ్ కూడా ఉంది అందేంటంటే?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 16, 2024 4:03 pm
    If you drink these two together in the kitchen with buttermilk, you will get constipated hush patak.

    If you drink these two together in the kitchen with buttermilk, you will get constipated hush patak.

    Follow us on

    Buttermilk : మలబద్ధకం కొందరికి దీర్ఘకాలిక సమస్యగా ఏర్పడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి మజ్జిగ సూపర్ ఫుడ్. మజ్జిగలో కొన్ని పదార్దాల్ని కలిపి తాగితే మరింత ప్రయోజనం. వీటిలో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి. ఇంతకీ ఆ పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    మజ్జిగకు బదులుగా జీలకర్ర, రాక్ సాల్ట్ కలిపిన మజ్జిగను తాగండి. ఈ సూపర్ డ్రింక్ తాగితే మలబద్దక సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఆహారంలో మన చేసే తప్పులు కారణంగా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది అంటున్నారు నిపుణులు. జంక్ ఫుడ్ , ప్రాసెస్డ్ ఫుడ్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారికి ఈ సమస్య మరింత ఎక్కువ బాధ పెడుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తగినంతగా తీసుకోవాలి.  కొన్ని మందుల దుష్ప్రభావాలు, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం, మలవిసర్జన పోస్ట్ పోన్ చేయడం, ఆందోళన లేదా నిరాశ వంటివి కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి.

    మజ్జిగలో జీలకర్ర, రాక్ సాల్ట్, కొత్తిమీర కలిపి తగడం వల్వ మంచి జరుగుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మన ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సమస్యను అధిగమించడానికి, ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల్ని చేర్చుకోండి.

    మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతాయి. మజ్జిగ కడుపుని చల్లబరుస్తుంది. పేగుల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. జీలకర్రలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంటాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌లను క్రమబద్దీకరిస్తుంది.

    జీలకర్రలో పోషకాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. మెటబాలిజం పెంపొందిస్తుంది. జీర్ణ సమస్యల్ని తొలగించడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఎసిడిటీతో బాధపడుతున్నట్లుయితే.. జీలకర్రను తీసుకోవడం మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఛాతి మంట, ఎసిడీటీ, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యల్ని జీలకర్ర తగ్గిస్తుంది. జీలకర్రను తీసుకుంటే ఇందులోని పొటాషియం, ఐరన్ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది.

    మజ్జిగ మలబద్ధకం పనిపడుతుంది. ఇందుకోసం గ్లాసు మజ్జిగలో జీలకర్ర, కొత్తిమీర కలిపి తీసుకోవాలి. రోజూ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఇతర కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, మజ్జిగ పల్చగా ఉండాలి. మజ్జిగను ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. జీలకర్రను పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తాగొచ్చు. రుచికి సరిపడా రాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు.