Homeఎంటర్టైన్మెంట్Malavika Mohanan: జిమ్ ఫిట్ లో మెంటల్ ఎక్కించే గ్లామర్... ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్...

Malavika Mohanan: జిమ్ ఫిట్ లో మెంటల్ ఎక్కించే గ్లామర్… ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ బోల్డ్ లుక్ వైరల్

Malavika Mohanan: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే యూ మోహనన్ కూతురైన మాళవిక మోహనన్ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. పుట్టింది కేరళలో అయినా కూడా పెరిగింది మాత్రం ముంబైలో. ఇక 2013లో విడుదలైన మలయాళ చిత్రం ‘పట్టం పోలే’ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. అనంతరం నిర్ణయకం టైటిల్ తో మరో మలయాళ చిత్రం చేసింది. అనూహ్యంగా రజినీకాంత్ మూవీ పేట లో కీలక రోల్ దక్కించుకుంది. పేట చిత్రంలో త్రిష హీరోయిన్ కాగా, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు.

మాళవిక మోహనన్ మాస్టర్ మూవీలో లెక్చరర్ పాత్రలో అలరించింది. విజయ్ హీరోగా నటించిన మాస్టర్ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. మాస్టర్ మంచి విజయం సాధించింది. అయితే మాళవిక మోహనన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మాళవిక మోహనన్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా మాళవిక మోహనన్ ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ చిత్రంలో మాళవిక మోహనన్ ఒక హీరోయిన్. ఈ మూవీలో ఆమెకు ఫైట్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ లో రౌడీలను దుమ్మురేపుతున్న ఓ లీక్డ్ వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాజా సాబ్ కామెడీ హారర్ థ్రిల్లర్ అంటూ ప్రచారం జరుగుతుంది. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సైతం హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో 2024 డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది . అలాగే విక్రమ్ కి జంటగా తంగలాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకుడు. బాలీవుడ్ లో ఓ మూవీ చేస్తుంది. అమ్మడు కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే గ్లామరస్ లుక్ చాలా అవసరం. అందుకే జిమ్ లో గంటల తరబడి కష్టపడుతుంది జిమ్ ఫిట్ లో హాట్ గా ఉన్న మాళవిక లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

RELATED ARTICLES

Most Popular