Heroine Dimple Hayathi: ఒకటి, రెండు సినిమాల్లో నటించిన కొందరు ముద్దుగుమ్మలు.. ఆ తరువాత సినిమాల్లో కనిపించకుండా పోతారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారికి విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోతారు. వీరికి స్టార్ ఇమేజ్ రాకపోయినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో సినిమాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా ఓ భామ ఓ సినిమా ద్వారా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అంతగా గుర్తింపు రాలేదు. అయినా పలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆమె నటించి ఇటీవల విడుదలైన ఓ మూవీ యావరేజ్ హిట్టు కొట్టింది. సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాకపోయినా అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో పిచ్చెక్కించే పిక్స్ తో యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసుకోండి.
నేటి కాలంలో సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం కష్టమైన పనే. కానీ సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది తమ ప్రతిభను బయటపెట్టి అవకాశాలు దక్కించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిన అమ్మాయి డింపుల్ హయాతి. ఈ భామ గురించి లేటేస్టుగా సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా భామకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది.
హైదరాబాద్ కు చెందిన డింపుల్ హయాతి 1988 ఆగస్టు 21లో జన్మించారు. 2017 ‘గల్ఫ్’ అనే సినిమాలో మొదటిసారిగా నటించింది. ఆ తరువాత 2019లో ‘యురేక’ సినిమాలో యాక్ట్ చేసింది. అప్పటి వరకు ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ అనే సినిమాలో ఐటెం సాంగ్ తో అమ్మడుకు గుర్తింపు వచ్చింది. ఆ తరువాత రవితేజ ‘ఖిలాడి’లో హీరోయిన్ గా నటించి ఫేమస్ అయింది.
అయితే ఈ భామకు సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన పిక్స్ తోఆకట్టుకుంటుంది. లేటేస్టుగా మసక చీకట్లో డింపుల్ హయాతిని చూసి కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. అయితే ఈ భామ లేటేస్టుగా గోపిచంద్ హీరోగా వస్తున్న ‘రామబాణం’లో నటించింది. ఈ మూవీ మే 5న రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా డింపుల్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.