Adipurush: ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఆది పురుష్’. తానాజీ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తీసిన దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు, సరికొత్త మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను ఎప్పుడో పూర్తి చేసుకొని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది.ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని గతం లో విడుదల చెయ్యగా ఎలాంటి విమర్శల పాలైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని,కార్టూన్ సినిమాని చూస్తున్న అనుభూతి కలిగింది అంటూ అభిమానులు సైతం పెదవి విరిచారు,దాంతో ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా, జూన్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా, సీతగా కృతి సనన్ , రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
ఇది ఇలా ఉండగా ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించి ‘జై శ్రీరామ్’ లిరికల్ వీడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.టీజర్ తో అభిమానుల్లో నెలకొన్ని నిరాశ మొత్తాన్ని ఈ లిరికల్ వీడియో సాంగ్ తుడిచిపెట్టేసింది.అయితే ఇప్పుడు అతి త్వరలోనే సీత కి సంబంధించిన మరో ప్రత్యేకమైన లిరికల్ వీడియో సాంగ్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు.
మొదటి లిరికల్ వీడియో సాంగ్ మొత్తం రాముడి గొప్ప తనం గురించి చెప్పగా, రెండవ లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో మొత్తం సీత గురించే ఉంటుంది, బ్యాక్ గ్రౌండ్ లో మధ్య మధ్యలో రాముడిని చూపిస్తుంటారు.సీత గా ఈ చిత్రం లో కృతి సనన్ నటించిన సంగతి తెలిసిందే, ఆమెకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ ని నేడు విడుదల చెయ్యగా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.