https://oktelugu.com/

Abhirami: హీరోయిన్ ను పట్టుకొని ‘అందంగా లేవు అంటీ’’ అన్నాడు.. నెటిజన్ దుమ్ముదులిపేసిన నటిమణీ

చెప్పవే చిరుగాలి సినిమాలో నటించిన అమ్మడు పేరు అభిరామి. ఈ అందాల భామ చెప్పవే చిరుగాలి తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ తమిళ్ లో వరుస సినిమాలు చేసి అభిమానులను సంపాదించింది. అభిరామి 2001 సంవత్సరంలో అర్జున్ నటించిన వానవిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 17, 2024 / 01:17 PM IST

    Abhirami

    Follow us on

    Abhirami: చెప్పవే చిరుగాలి సినిమా గుర్తుందా? అప్పట్లో హిట్ గా నిలిచిన ఈ సినిమాతో హీరోహీరోయిన్ లకు చాలా మంది అభిమానులు అయ్యారు. ఇందులో హీరోగా నటుడు వేణు తొట్టెంపూడి నటించారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఇందులో హీరో వేణును ప్రేమించే అమ్మాయిగా కనిపించిన ఆ నటి గుర్తుందా మీకు? ఈమె గురించి ఓ వార్త ఇప్పుడు ఫుల్ గా వైరల్ గా మారింది. అదేంటో ఓ సారి చూసేయండి.

    చెప్పవే చిరుగాలి సినిమాలో నటించిన అమ్మడు పేరు అభిరామి. ఈ అందాల భామ చెప్పవే చిరుగాలి తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ తమిళ్ లో వరుస సినిమాలు చేసి అభిమానులను సంపాదించింది. అభిరామి 2001 సంవత్సరంలో అర్జున్ నటించిన వానవిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా అమ్మడుకు పెద్దగా హిట్ లు లేకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఇక సినిమా నటిగా మానేసి ఏకంగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సంవత్సరాలు చేసింది. ఇలా ఇండస్ట్రీలో రన్ అవుతూనే.. కమల్ హాసన్ నటించిన విశ్వరూపం తో తిరిగి సినీ రంగ ప్రవేశం చేసింది అభిరామి.

    అభిరామి తాజాగాతన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. . అందులో 24 ఏళ్లుగా తన మేకప్ మేన్ గా పనిచేస్తున్న ప్రసాద్ ను గురించి అందరికీ తెలిపింది. నాతో 24 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రసాద్‌కి తమిళంలో న అనే అక్షరాన్ని ఎలా పలకాలో తెలియదు అంటూ తెలిపింది. తాను చాలా సార్లు ప్రయత్నించినా ఆయన అక్షరాన్ని సరిగ్గా పలకలేకపోయాడు అంటూ తెలిపింది. ఆ తర్వాత నాలుక మడత పెట్టి జ అక్షరాన్ని ఎలా పలకాలో నేర్పించి వీడియోను పోస్ట్ చేసింది.

    దీన్ని చూసిన ఆమె అభిమానులతో సహా నెటిజన్లు తన ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తన మేకప్ మెన్ ను అవమానించింది అంటూ విమర్శిస్తున్నారు. ఇక అభిరామి ఊరుకుంటుందా? ఆమె కూడా తనదైన స్టైల్ లో రిప్లే ఇచ్చి అందరి నోళ్లు మూయించింది.

    అందంగా లేవు, ఆంటీ అని కామెంట్ చేసిన వారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇలా అనడం కంటే సైలెంట్ గా ఉండవచ్చు కదా.. చూడకు ఎవరు చూడుమన్నారు అంటూ కౌంటర్ ఇచ్చింది అభిరామి.. మరొకరు నటించడం మానేశారా? మేకప్ వేసుకోవడం లేదా, తెలియదా అంటూ కామెంట్ చేస్తే..నేను అతని వృత్తి మీద కామెంట్లు చేసి మాట్లాడను అంటూ తెలిపింది. అంటూ లేదా అని అడిగితే.. ఇలా రిప్లేలు, కౌంటర్లు ఇస్తుంటే.. ‘కౌంటర్లు ఇస్తుంది మీరేనా.. మీ అడ్మిన్ కాదా..?’ అంటూ మరొకరు అడిగారు. దీనికి కూడా సమాధానం ఇస్తూ.. అవును నాకు సమయం దొరికినప్పుడు సమాధానం ఇస్తాను,” అని తప్పించుకుంది అభిరామి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.