కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ వి కాకపోయినా ఫీల్ గుడ్ అనిపిస్తాయి. మనసును దోచే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన ‘చెప్పవే చిరుగాలి’ సినిమా మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇందులో వేణు ప్రేమించే యువకుడిగా కనిపిస్తాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు ఆషిమా బల్లా, మరొకరు అభిరామి. వీరిలో అభిరామి అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. ఆమె ఇప్పడు ఏం చేస్తుందో తెలుసా?
కేరళలో తిరువంతపురంలో జన్మించిన అభిరామి అసలు పేరు దివ్య గోపీకుమార్. ఈమె 1983 జూలై లో జన్మించారు. చదువుపు పూర్తి చేసుకున్న అభిరామి మలయాళంలోని ‘కథాపురుషన్’ అనే చిత్రం ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆసియా నెట్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా చేశారు. ఆ తరువాత 1999లో ‘పత్రమ్’ అనే సినిమాతో మరోసారి సినిమా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అనతి కాలంలోనే తమిళ స్టార్ హీరో కమలాసన్ చిత్రం ‘విరుమాండి’( తెలుగులో పోతురాజు) సినిమాలో నటించిన తరువాత గుర్తింపు వచ్చింది.
తెలుగులో 2002లో ‘సుబ్బారావు గారికి ధన్యవాదాలు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2004లో వచ్చి ‘చెప్పవే చిరుగాలి’తో ఫేమస్ అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు సినిమాల్లో నటించి ఆమె మరోసారి తెలుగు ఇండస్ట్రీ వైపు చూడలేదు. అయితే అప్పటికీ, ఇప్పటికీ అభిరామి అందం పెరిగింది. అందం విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుంది. అభిరామి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో అవి వైరల్ అవుతున్నాయి.