Kamal Haasan: దక్షిణ భారత సినిమా ప్రముఖ హీరో సూపర్‌స్టార్ కమల్‌హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిదే. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, కమల్ హాసన్‌కు కొవిడ్ సోకిందని తెలిసినప్పటినుంచి ఆయన అభిమానులకు ఆందోళన నెలకొంది. త్వరగా కమల్ కోలుకోవాలని పగలు, రాత్రి పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కుమార్తె శ్రుతి హాసన్ ట్విట్టర్ వేదికగా కమల్ కోలుకుంటున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.
మరోవైపు కమల్ ఆరోగ్య పరిస్థితి గురించి రజనీకాంత్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా, శ్రుతిహాసన్ ఆయన విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.శృతి హాసన్ తన తండ్రి పక్కన శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో ఉండటానికి చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కమల్ క్వారంటైన్లో కొనసాగుతున్నప్పటికీ.. శ్రుతి ఆసుపత్రిలోనే ఉండి.. తన తండ్రిని దగ్గరుడి చూసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనకున్న బిజీ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసుకుని.. చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం. కమల్ పూర్తిగా కోలుకునేంత వరకు శ్రుతి అక్కడే ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Marakkar: డిసెంబరు 3న థియేటర్లలో అడుగుపెట్టనున్న సముద్ర సింహం
ప్రస్తుతం శ్రుతి హాసన్ వరుస సినిమాలో బిజీగా ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సలార్‌లో హీరోయిన్గా నటిస్తుండగా.. మరోవైపు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యే ఓ వెబ్‌సిరీస్‌లోనూ కనిపించనుంది. దీంతోపాటు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్నసినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. మరోవైపు కమల్ హాసన్ తన రాబోయే తమిళ యాక్షన్ చిత్రం ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్-థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా నటించారు.
Also Read: KS Nageswararao: టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Heroin shruthi hasan strong decision about her father
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com