Superstar Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) కెరీర్ లోనే కాదు, కమర్షియల్ సినిమాల్లో కల్ట్ క్లాసిక్ గా నిల్చిన చిత్రాల లిస్ట్ తీస్తే అందులో ‘శివాజీ'(Sivaji Movie) చిత్రం కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో రజనీకాంత్ సినిమా చేయడం అదే తొలిసారి. అప్పట్లో ఈ చిత్రం పై అటు తమిళం లో ఎలాంటి భారీ అంచనాలు ఉండేవో, టాలీవుడ్ లో కూడా అలాంటి భారీ అంచనాలు ఉండేవి. అలా కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సునామీ ని నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక సున్నితమైన అంశాన్ని కమర్షియల్ పద్దతిలో ఇలా కూడా చెప్పొచ్చా అని శంకర్ తన దర్శకత్వ ప్రతిభ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన చిత్రమిది. ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి.
Also Read : ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కనిపించనున్న సీనియర్ నటి…
ముందుగా ఈ కథ అనుకున్నప్పుడు హీరో పాత్ర కోసం కమల్ హాసన్ ని తీసుకోవాలని అనుకున్నాడట డైరెక్టర్ శంకర్. ఎందుకంటే గతం లో ఆయన కమల్ తో ‘భారతీయుడు’ వంటి సామజిక అంశాలతో కూడిన కమర్షియల్ సినిమా చేసి సంచలనం సృష్టించాడు కాబట్టి. కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో చెయ్యాలని అనుకున్నాడట. చిరంజీవి తో సినిమా చెయ్యాలని ఎన్నో ఏళ్ళ నుండి అనుకుంటున్నప్పటికీ కుదర్లేదని, కనీసం ఈసారైనా చిరంజీవి కి ఈ కథని వినిపించాలనే ఉద్దేశ్యంతో ఉండేవాడట. అంతే కాకుండా చిరంజీవి అప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడని వార్త రావడంతో ఆయనకు ఈ సినిమా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుందని అనుకున్నాడు. కానీ చిరంజీవి అప్పటికే సినిమాల నుండి దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నాడని శంకర్ కి తెలిసింది, దీంతో ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెరకెక్కించాడు.
ఒకవేళ చిరంజీవి ఒప్పుకొని ఈ సినిమా చేసుంటే కచ్చితంగా ఆయనకు అప్పట్లో బాగా ఉపయోగపడేది. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్లేముందు ఆయన ‘శంకర్ దాదా జిందాబాద్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజకీయాల్లోకి వెళ్లేముందు చిరంజీవి సినిమాల పరంగా అభిమానులకు చేదు జ్ఞాపకాలను అందించి వెళ్ళిపోయాడు. ఒకవేళ శివాజీ చిత్రం ఆయన ఒప్పుకొని చేసుంటే ఇండస్ట్రీ రికార్డ్స్ వేరే లెవెల్ లో ఉండేవి, అభిమానులకు సంపూర్ణమైన సంతృప్తి దొరికేది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే శివాజీ ఆరోజుల్లోనే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. రజినీకాంత్ స్టార్ స్టేటస్ ని సౌత్ లో శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది.