AM Ratnam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) వచ్చే నెల 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. సుమారుగా ఐదేళ్ల నుండి సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం అనేక కష్టాలను దాటుకుంటూ ఎట్టకేలకు గత నెలలోనే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తి అయిన వెంటనే విడుదల తేదీని ప్రకటించి ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టారు మేకర్స్. రీసెంట్ గానే హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ‘అసుర హననం’ అనే పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు అటు ఫ్యాన్స్ నుండి, ఇటు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఉదయం చెన్నై లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ చిత్రం లోని ‘తార తార’ అనే ఐటెం సాంగ్ ని విడుదల చేసారు.
Also Read : KGF మేకర్స్ తో హృతిక్ రోషన్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!
ఈ ఐటెం కి సాంగ్ కి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఈవెంట్ లో AM రత్నం(AM Ratnam) పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘మన దేశంలో మెగాస్టార్ చిరంజీవి,అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ కేవలం కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ కి మాత్రమే నటన మీద మాత్రమే కాకుండా సినిమాలోని ఇతర క్రాఫ్ట్స్ మీద కూడా మంచి పట్టు ఉన్నది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క సినిమాకే దర్శకత్వం వహించి ఉండొచ్చు, కానీ ఆయన టెక్నీకల్ విభాగం లో ఉన్న పరిజ్ఞానాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మ్యూజిక్ పరంగా కూడా ఆయన స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తో సిట్టింగ్ లో కూర్చొని తన అభిరుచికి తగ్గట్టుగా మ్యూజిక్ ని కొట్టించుకుంటాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ నిర్మాత AM రత్నం గురించి మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘సినిమా మీద అమితమైన ప్యాషన్ ఉన్న నిర్మాతలలో ఒకరు రత్నం గారు. అలాంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్ తో పోలిస్తే నేను అసలు సరితూగను. సెట్స్ లోకి ఆయన తెల్లవారు జామునే వచ్చేస్తాడు. ఎండైనా,వాన అయినా ఆయన సెట్స్ లోనే కూర్చుంటాడు. అందరి నటీనటుల బాగోగులు దగ్గరుండి చూసుకుంటాడు. సెట్స్ లోకి అందరికంటే ముందు వచ్చేది ఆయనే, చివరిగా సెట్స్ నుండి తిరిగి వెళ్ళేది కూడా ఆయనే’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కేవలం ఇంగ్లీష్ లోనే కాదు, నిధి అగర్వాల్ తమిళం లో కూడా ప్రసంగం ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది.