Spirit : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డివంగ (Sandeep Rddy Vanga) ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమాతో తను మరొక ఎత్తుకు ఎదుగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన సినిమా లకు కొన్ని వర్గాల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్న క్రమంలో ప్రస్తుతం తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇంతకుముందు ఆయన చేసిన ఆనిమల్ (Animal) సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టింది. మరి ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడతానని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : స్పిరిట్ సినిమాలో నటిస్తున్న తెలుగు స్టార్ హీరో…
పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. తద్వారా సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడా? లేదా అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు నుంచి వచ్చే ప్రతి సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతుంది అంటూ కొన్ని విమర్శలైతే వస్తున్నప్పటికి ఆయన ఎప్పటికప్పుడు వాటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి స్పిరిట్(Spirit) సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తో వస్తుందా? లేదంటే జెన్యూన్ అటెంప్ట్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు… ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా మమ్ముట్టి నటించబోతున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఫాదర్ గా మమ్ముట్టి (Mammutty) కాకుండా కమల్ హాసన్ (Kamal Hasan) నటించిన బోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే సందీప్ రెడ్డివంగా ఈ విషయాల పైన స్పందించాల్సిన అవసరమైతే ఉంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మీద భారీ బజ్ ను క్రియేట్ చేయడానికి స్టార్ క్యాస్టింగ్ తో సినిమా మొత్తాన్ని నింపేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ పై సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ!