Sai Pallavi: హీరోయిన్​గా సాయిపల్లవి చెల్లెలు ఎంట్రీ.. ఫస్ట్ లుక్​ కూడా వచ్చేసింది

Sai Pallavi: ప్రస్తుతం వరుస సూపర్​ హిట్​ చిత్రాలతో.. ఫుల్​ ఫామ్​లో దూసుకెళ్లిపోతోంది హీరోయిన్​ సాయి పల్లవి. తన గ్లామర్​, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాలీ బ్యూటి. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్​ను ఒక్కో సారి హీరోలు కూడా అందుకోవడం కష్టమే.. ఆ రేంజ్​లో డాన్స్ చేస్తుంది సాయిపల్లవి. కాగా, తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్​ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పూజా ఇండస్ట్రీ ఎంట్రీపై […]

Written By: Raghava Rao Gara, Updated On : November 22, 2021 12:59 pm
Follow us on

Sai Pallavi: ప్రస్తుతం వరుస సూపర్​ హిట్​ చిత్రాలతో.. ఫుల్​ ఫామ్​లో దూసుకెళ్లిపోతోంది హీరోయిన్​ సాయి పల్లవి. తన గ్లామర్​, అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాలీ బ్యూటి. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్​ను ఒక్కో సారి హీరోలు కూడా అందుకోవడం కష్టమే.. ఆ రేంజ్​లో డాన్స్ చేస్తుంది సాయిపల్లవి. కాగా, తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్​ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పూజా ఇండస్ట్రీ ఎంట్రీపై అనేక వార్తలు వచ్చాయి. తాజాగా, వాటిని నిజం చేస్తూ.. తన సినిమాకు సంబంధించిన అప్​డేట్​ను సోషల్​మీడియా వేదికగా పంచుకుంది పూజా.

తమిళ దర్శకుడు సిల్వ తెరకెక్కిస్తోన్న చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ సినిమాలో హీరోయిన్​గా నటించింది పూజా. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు.  ఈ సినిమాను థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జీ5లో డిసెంబరు 3న ఈ సినిమా విడుదల కానుంది. మరి అక్క సాయిపల్లవికి ఉన్న క్రేజ్​ను పూజా కన్నన్​ ఏ మేరకు సాధిస్తుందో తెలియాలి.

ఇటీవలే లవ్​స్టోరీతో మంచి హిట్​ కొట్టిన సాయిపల్లవి.. శ్యామ్​సింగరాయ్​తో మరోసారి పలకరించేందుకు సిద్ధమైంది. ఇందులో విభిన్న పాత్రలో నటిస్తోంది సాయిపల్లవి. దీంతో పాటు విరాట పర్వంలోనూ హీరోయిన్​గా నటించింది. గతేడాదిలోనే ఈ సినిమా షూటింగ్​ పూర్తి కాగా.. కరోనా కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.