https://oktelugu.com/

Rajamouli: పవన్​ కళ్యాణ్​తో రాజమౌళి భేటీ.. ఆ విషయంపైనే చర్చించనున్నారా?

Rajamouli: ప్రముఖ దర్శకుడు రాజమౌళి పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​తో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు సమాచారం. వచ్చే వారం హైదరాబాద్​లో ఈ సమావేసం జరగే అవకాశం ఉంది. వీరిద్దరి కలయికకు సినిమా విడుదల విషయంలో తలెత్తిన సమస్యలే కారణమని తెలుస్తోంది. రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పటికే ఏపీలో టికెట్​ ధరతగ్గింపు ఆర్​ఆర్​ఆర్​కు సమస్యగా మారగా.. ఇప్పుడు పవన్​ కల్యాణ్​ నటించిన భీమ్లనాయక్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 12:42 PM IST
    Follow us on

    Rajamouli: ప్రముఖ దర్శకుడు రాజమౌళి పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​తో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు సమాచారం. వచ్చే వారం హైదరాబాద్​లో ఈ సమావేసం జరగే అవకాశం ఉంది. వీరిద్దరి కలయికకు సినిమా విడుదల విషయంలో తలెత్తిన సమస్యలే కారణమని తెలుస్తోంది.

    రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పటికే ఏపీలో టికెట్​ ధరతగ్గింపు ఆర్​ఆర్​ఆర్​కు సమస్యగా మారగా.. ఇప్పుడు పవన్​ కల్యాణ్​ నటించిన భీమ్లనాయక్​ మరో కొత్త తలనొప్పిగా మారింది.

    ఈ రెండు సినిమాల విడుదల తేదీల్లో వారం రోజులు గ్యామ్​ ఉంది. ఈ క్రమంలోనే ఒకవేళ ఆర్​ఆర్​ఆర్​ కాస్త అటూ ఇటూ అయినా.. భీమ్లనాయక్​ ప్రభావం సినిమాపై భారీగా పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే భీమ్లానాయక్ విడుదల తేదీని వాయిదా వేయాలని కోరేందుకు రాజమౌళి పవన్​ను ప్రత్యేకంగా కలపనున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ నిర్మాతల మధ్య చర్చలు జరగగా పెద్ద ఫలితం లేకపోయింది. ముఖ్యంగా భీమ్లానాయక్ దర్శకనిర్మాతలపై వెనక్కి తగ్గాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజా ట్వీట్​లో వెనక్కి తగ్గేదే లేదంటూ క్లారిటీ ఇచ్చాడు.

    రాజమౌళి, పవన్ సమావేశానికి ముందే.. ఆర్​ఆర్​ఆర్​ నిర్మాతలు దానయ్య, దిల్ రాజు తదితరులు.. త్రివిక్రమ్​ను కలిసేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సమావేశాల తర్వాత భీమ్లానాయక్​ వెనక్కి తగ్గుతాడా?.. లేక మొండిగా ముందుకు దూసుకెళ్తాడా తెలియాల్సి ఉంది.