Hero Vishal : తెలుగు, తమిళ మార్కెట్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకడు విశాల్ రెడ్డి(Vishal Reddy). ఈయన పందెం కోడి అనే సినిమా ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తమిళం లో కంటే తెలుగు లోనే ఆయన సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యేవి. పొగరు, భరణి, పిస్తా, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే విశాల్ తమిళం లో అప్పట్లో వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) తో ప్రేమాయణం నడిపాడు అంటూ అప్పట్లో రూమర్స్ వినిపించేవి. ఇప్పుడు అభినయ(Abhinaya) అనే యంగ్ హీరోయిన్ తో చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : జైలర్ 2 అప్డేట్: రజినీ ఫ్యాన్స్ గెట్ రెడీ!
రీసెంట్ గానే అభినయ నిశ్చితార్థం చేసుకొని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో ని అప్లోడ్ చేసింది. ఆ ఫొటోలో తన కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్నట్టు మాత్రమే చూపించింది కానీ, ఎవరు తన కాబోయే భర్త అనేది మాత్రం చూపించలేదు. దీంతో సోషల్ మీడియా లో అందరూ విశాల్ తో రహస్యం గా నిశ్చితార్థం చేసుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ చెయ్యి చూస్తుంటే విశాల్ చెయ్యి లాగానే ఉందని, కచ్చితంగా అతనే అయ్యుంటాడని అంటున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అభినయ గురించి మన అందరికీ తెలిసిందే. ఈ అమ్మాయి పుట్టుకతోనే మూగ, చెవుడు తో పుట్టింది. అయినప్పటికీ నటన అద్భుతంగా చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.
తెలుగు లో ఇప్పటి వరకు ఈమె శంభో శివ శంభో, నేనింతే, కింగ్, డమరుకం, దమ్ము, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజు గారి గది 2, సీతారామం, గామి వంటి చిత్రాల్లో నటించింది. పలు సినిమాల్లో ఈమె నెగటివ్ రోల్స్ కూడా చేసింది. ఇలా మాటలు రాని ఒక అమ్మాయి, అద్భుతంగా నటిస్తూ ఇండస్ట్రీ లోకి దూసుకొని రావడం ఇది వరకు మనం ఎప్పుడూ చూడలేదు. అన్ని చక్కగా ఉండేవాళ్ళు కూడా ఈమె స్థాయిలో నటించలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే విశాల్ నిజంగా ఈమెని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చి ఉండుంటే కచ్చితంగా అతన్ని మెచ్చుకొని తీరాల్సిందే. పెళ్లి రోజు అధికారికంగా ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో ఫోటో చూపించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు విశాల్ తో నిశ్చితార్థం జరిగింది అనేది ఒక రూమర్ గానే పరిగణించాలి.
Also Read : శివమణి కాంబినేషన్ రిపీట్ కానుందా..? అక్కినేని ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున!