Nagarjuna: సీనియర్ హీరోలు చిరంజీవి(Megastar Chiranjeevi), వెంకటేష్(Victory Venkatesh), బాలయ్య(Nandamuri Balakrishna) వంటి వారు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో నేటి తరం స్టార్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంటే, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మాత్రం ఖాళీగా ఉంటున్నాడు. ఆయన గత చిత్రం ‘నా సామి రంగ’ విడుదలై ఏడాది అయ్యింది. కమర్షియల్ గా ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. తన తోటి హీరోలు ఒక్కొక్కరు వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను అవలీలగా అందుకుంటూ ఉంటే, నాగార్జున ఇంకా 20 కోట్ల మార్కెట్ దగ్గరే ఆగిపోయాడు. 2016 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ననాయన’ చిత్రం అప్పట్లోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘ఊపిరి’ కూడా 50 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత నాగార్జున కెరీర్ లో సరైన సూపర్ హిట్ లేదు.
అక్కినేని అభిమానులు నాగార్జున నుండి ఒక బలమైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనేమో మెల్లగా తన కెరీర్ ని క్యారక్టర్ రోల్స్ కి పరిమితం చేసేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ'(Coolie Movie) చిత్రంలో విలన్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సోలో హీరో గా చేసేందుకు పలు కథలు విన్నప్పటికీ, వాటిని రిజెక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ తో మాత్రం ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పూరి జగన్నాథ్(Puri Jagannath) కెరీర్ ప్రస్తుతం ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో ఆయన కెరీర్ చివరి స్థానానికి చేరుకుంది. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు ఎవ్వరూ పూరితో సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేరు. కానీ నాగార్జున మాత్రం పూరి జగన్నాథ్ ని గట్టిగ నమ్మినట్టు తెలుస్తుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘శివమణి’, ‘సూపర్’ సినిమాలు వచ్చాయి. ‘శివమణి’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడగా, సూపర్ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ రెండు చిత్రాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. పూరి జగన్నాథ్ కి ఇది గోల్డెన్ అవకాశం. కెరీర్ గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఆయనకు ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ మళ్ళీ కొత్త ఊపిరి ని పోసింది. ఇప్పుడు నాగార్జున తో తీయబోయే సినిమా కూడా ఆయనకు డైరెక్టర్ గా పెద్ద సవాల్ కానుంది, చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది.