Homeఎంటర్టైన్మెంట్Jailer 2: జైలర్ 2 అప్డేట్: రజినీ ఫ్యాన్స్ గెట్ రెడీ!

Jailer 2: జైలర్ 2 అప్డేట్: రజినీ ఫ్యాన్స్ గెట్ రెడీ!

Jailer 2: 2018లో వచ్చిన 2.0 అనంతరం రజినికాంత్ కి సరైన హిట్ లేదు. ఆయన నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. పేట, దర్బార్, అన్నాత్తే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. తెలుగులో ఆయన మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో రజినీకాంత్ కి పూర్వ వైభవం తెచ్చిన మూవీ జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. హీరోయిన్ తమన్నా ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. ఆమె నటించిన నువ్వు కావాలయ్యా సాంగ్ ఊపేసింది. సునీల్ సైతం ఓ కీలక రోల్ చేశాడు.

Also Read: SSMB 29 లీక్… రాజమౌళి కావాలనే చేశాడా? తెరపైకి విస్తుగొలిపే విషయాలు!

మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేయడం విశేషం. జైలర్ వరల్డ్ వైడ్ రూ. 650 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంచనాలకు మించి విజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు రజినీకాంత్ కి కాస్ట్లీ గిఫ్ట్స్, పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చారు. జైలర్ చిత్రానికి రజినీకాంత్ రూ. 210 కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. రమ్యకృష్ణ రజినీకాంత్ భార్య పాత్ర చేసింది. నటుడు వినాయకన్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. వసంత్ రవి కొడుకు పాత్ర చేశాడు.

జైలర్ తో రజినీకాంత్ తన రేంజ్ హిట్ కొట్టాడు. గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. జైలర్ సక్సెస్ నేపథ్యంలో జైలర్ 2 ప్రకటించారు. నేడు కీలకమైన అప్డేట్ ఇచ్చారు. జైలర్ 2 చిత్రాన్ని సైతం సన్ పిక్టర్స్ నిర్మిస్తున్నారు. మార్చి 10 నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ న్యూస్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. కాగా జైలర్ 2లో సైతం స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ ఉంటాయట. నటసింహం బాలకృష్ణ ఈసారి రజినీకాంత్ తో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని గతంలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.

దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో జైలర్ 2 తెరకెక్కిస్తున్నారు. అలాగే రజినీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో కింగ్ నాగార్జున ఓ కీలక రోల్ చేస్తున్నాడు. పూజ హెగ్డేతో నాగార్జునకు ఓ ఐటెం సాంగ్ ఉందంటూ ప్రచారం అవుతుంది. రజినీకాంత్ కి కూలీ, జైలర్ 2 రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడనున్నాయి. జైలర్ 2 అప్డేట్ తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular