Champions Trophy 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్ గా నిలిచింది. మ్యాచ్ అనంతరం టీమిండియా సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ విజయం తర్వాత, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆలింగనం చేసుకుని అభినందించిన హృద్యమైన క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆత్మీయ ఆలింగనం..
ఈ సందర్బంగా రోహిత్ శర్మ తన కూతురితో సంబరాలు జరుపుకుంటుండగా.. అక్కడే ఉన్న అనుష్క శర్మ రోహిత్ శర్మని పిలిచి మరి ఆ లింగనం చేసుకున్నారు. అనుష్క, విరాట్ కోహ్లీ భార్యగా ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియంలో ఉంది. విజయం తర్వాత రోహిత్‌తో పాటు జట్టును ఉత్సాహపరిచింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి, భారత్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేధించడంలో కీలక పాత్ర పోషించాడు.
జట్టును విజయవంతంగా నడిపినందుకు.
మ్యాచ్ అనంతరం, రోహిత్ తన భార్య రితికా సజ్దేహ్ మరియు కుమార్తె సమైరాతో సంతోష క్షణాలను పంచుకుంటుండగా, అనుష్క అతనిని కలిసి ఒక ఆప్యాయమైన హగ్ ఇచ్చి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపింది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపినందుకు అభినందించారు. ఈ దృశ్యం కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడింది, ఇది జట్టు సభ్యుల మధ్య మరియు వారి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది.
ఈ సంఘటన భారత క్రికెట్ అభిమానులకు ఒక ఆనందకరమైన క్షణంగా నిలిచిపోయింది, ఎందుకంటే ఇది ఆటగాళ్లు, వారి కుటుంబాల మధ్య ఉన్న బంధాన్ని హైలైట్ చేసింది.