https://oktelugu.com/

Hero Sharwanand: సిక్స్ ప్యాక్ చేసాకే నెక్స్ట్ మూవీ చేస్తా అంటున్న హీరో శర్వానంద్

Hero Sharwanand: సంతోష్‌ జాగర్లపూడి దర‍్శకత్వంలో హీరో నాగశౌర్య అందాల బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం “లక్ష్య”.ఈ చిత్రం డిసెంబర్ 10న థియేటర్ లో ప్రేక్షకులను అలరించనుంది.ఈ సందర్భంగా ఫ్రీ-రిలీజ్‌ వేడుక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్‌, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్‌ అతిథులుగా ఆహ్వానితులు అయ్యారు. ఈ వేడుకలో హిరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ నేపథ్యంతో సినిమా ను తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలి. ఇటువంటి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 6, 2021 / 06:45 PM IST
    Follow us on

    Hero Sharwanand: సంతోష్‌ జాగర్లపూడి దర‍్శకత్వంలో హీరో నాగశౌర్య అందాల బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం “లక్ష్య”.ఈ చిత్రం డిసెంబర్ 10న థియేటర్ లో ప్రేక్షకులను అలరించనుంది.ఈ సందర్భంగా ఫ్రీ-రిలీజ్‌ వేడుక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్‌, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్‌ అతిథులుగా ఆహ్వానితులు అయ్యారు.

    Naga Shaurya Sharwanand

    ఈ వేడుకలో హిరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ నేపథ్యంతో సినిమా ను తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలి. ఇటువంటి జోనర్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు హీరో మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఈ చిత్రం కోసం నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది ఈ సినిమా తర్వాత నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి తెలిపారు.నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస‍్తా అని నవ్వుతూ శర్వానంద్ అన్నారు.

    Also Read: Thaman: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విజయ రహస్యం ఏంటీ?

    “లక్ష్య” సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్న ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు తనకోసం నిలబడ్డారని హీరో నాగశౌర్య అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ క్రీడా సినిమాల్లో మేలు రాయగా నిలిచిపోయే చిత్రం ‘లక్ష్య’ కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపించంద్ అన్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కించడం సాదా సీదా విషయం కాదని ఎంత కృషితో నాగ శౌర్య కష్టపడ్డారని ఆ కష్టానికి ఫలితం దొరుకుతుంది దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

    Also Read: Actress Samantha: పాన్ ఇండియా మూవీలో సమంత… “యశోద” గా టైటిల్ ఖరారు