Bandi Sanjay: అంబేద్కర్ జయంతి, వర్ధంతులు జరుపుకుంటున్నా ఆయన గురించి ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. అటు ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, ఇటు రాష్ర్టంలో ఏడేళ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కూడా అంబేద్కర్ విగ్రహాల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో రాష్ర్టంలోని హైదరాబాద్ లోని అసెంబ్లీలో పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కే పార్టీగా ఖ్యాతి సంపాదించుకుంది.
కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ విగ్రహాలపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించింది బీజేపీ ప్రభుత్వమే. కానీ కాంగ్రెస్ మాత్రం అంబేద్కర్ కోసం ఏనాడు పాటుపడలేదు. భావి తరాలకు స్ఫూర్తినిచ్చిన ఆయన గురించి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు గా పార్టీలు వ్యవహరించడం బాధాకరమే. అంబేద్కర్ జయంతి, వర్ధంతి ఉత్సవాలు చేస్తున్నా ఆయన కోసం ఏ చట్టాలు చేయకపోవడం విచారకరం.
దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు మాట తప్పారు? దళితులు రాజ్యాంగ పదవులు నిర్వహించడానికి పనికి రారా? సీఎం పదవికి సరిపోరా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన బాసలు ఏమయ్యాయి. వాగ్దానాలు ఏ మూలకు పోయాయి. ఇన్నాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
Also Read: Etela Rajender: ఈటలకు ఇక మూడినట్టేనా?
ఈ మేరకు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలోని అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, బీజేపీ నేత విఠల్ తదితరులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Also Read: BJP: ఉద్యోగుల సంఘం నేత విఠల్ చేరికతో బీజేపీకి కొత్త ఊపు వచ్చేనా?