Dulquer Salmaan: ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు దుల్ఖర్ సల్మాన్.మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు దుల్ఖర్. తన అద్భుతమైన నటనతో తన సినిమాలకు తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పుకొని తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచిపోయారు ఈ కుర్ర హీరో. ఈ ఏడాది నవంబర్ 12 “కురుప్” చిత్రంతో మంచి విజయాం అందుకొని వరుస సినిమాలతో బిజీ అయ్యారు దుల్ఖర్. ప్రస్తుతం కృష్ణగాడి వీర ప్రేమగాథ దర్శకుడు హను రాఘవపూడి ఒక చిత్రంలో నటిస్తున్నారు.
దర్శకుడు హను రాఘవపూడి దుల్ఖర్ సల్మాన్, కాంబినేషన్ లో “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వప్న ఫిల్మ్స్ , వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్స్ పై నిర్మాణం జరుపుకుంటోంది. వార్ అండ్ లవ్ నేపథ్యంతో ఉత్కంఠగా సాగి సన్నివేశాలతో మిలటరీ బేస్ తో ఓ అందమైన ప్రేమకథా గా తెరకెక్కనుంది.ఇటీవల ఈ సినిమా హిమాచల్ ప్రదేశ్ లో 9 రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దుల్కర్ సల్మాన్ తన ఫేస్ బుక్ పేజ్ లో తెలియచేస్తూ దానికి సంబంధించిన ఫోటోస్ కూడా అభిమానులతో పంచుకున్నారు.
Also Read: Actress Samantha: పాన్ ఇండియా మూవీలో సమంత… “యశోద” గా టైటిల్ ఖరారు
అందాల రాక్షసి’ సినిమా తో దర్శకుడుగా పరిచయం అయ్యారు హను రాఘవపూడి. ఓ మోస్తరు విజయం అందుకోగా ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడిపడిలేచె మనసు’ చిత్రాల్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలు భారీ విజయాలు అందుకుంటాయి అనుకున్నారు కానీ హనుకి తీవ్ర నిరాశనే కలిగించాయి.మరి ‘లెఫ్టినెంట్ రామ్’ చిత్రం దర్శకుడిగా హను రాఘవపూడికి మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.
Also Read: Telugu Cinema: తెలుగు సినిమా రంగాన్ని మార్చేసిన చిత్రాలు ఇవే !