Ram- Balakrishna: బాలయ్య గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య స్పీడ్ ను యంగ్ హీరోలు కూడా అందుకోవడం కష్టంగా ఉంది. అసలు గ్యాప్ ఇవ్వడానికి కూడా బాలయ్య ఇష్టపడటం లేదు. ఇప్పటికే మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక సినిమా, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే.. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా దాదాపు ఫిక్స్ అయింది. అంటే.. బాలయ్య నుంచి మూడు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. పైగా ఈ చిత్రాలను మైత్రీ మూవీస్, దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇప్పుడు బాలయ్య జాబితాలో మరో చిత్రం చేరబోతోంది. బాలయ్య కోసం తమిళ మాస్ డైరక్టర్ లింగుస్వామి ఓ కథను సిద్ధం చేశాడు. రీసెంట్ గా బాలయ్యకు కథ కూడా చెప్పాడు.
Also Read: Janasena Digital War: గుడ్ మార్నింగ్ సీఎం సార్.. జనసేన ‘డిజిటల్ వార్’
లింగుస్వామి కథ బాలయ్యకు బాగా నచ్చింది. ఈ మధ్య తమిళంలోని దర్శకులకు అక్కడ హీరోలు డేట్లు ఇవ్వడం లేదు. నిజానికి లింగుస్వామి యాక్షన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. ప్రస్తుతం హీరో రామ్ తో కలిసి వారియర్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. అందుకే, బాలయ్య – లింగుస్వామి కలయికలో కూడా ఓ సినిమా వస్తే బాగుంటుంది అని బాలయ్య సన్నిహితులు కోరుకుంటున్నారు.
నిజానికి రెండు నెలల క్రితం నిర్మాత సి కళ్యాణ్.. బాలయ్యను – లింగుస్వామిని కలపాలని చూశారు. ఐతే అప్పుడు ఈ కలయిక సెట్ కాలేదు. కానీ, హీరో రామ్ పర్సనల్ గా బాలయ్యకి కాల్ చేసి, లింగుస్వామి గురించి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి లింగుస్వామి – బాలయ్య సినిమా సెట్ అయింది. ఈ మధ్య తమిళ హీరోలు, తెలుగు డైరక్టర్లతో సినిమాలు చేస్తున్నారు.
తెలుగు హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి తెలుగు – తమిళ బాషల మార్కెట్ కోసం మన మేకర్స్ కొత్తగా ప్లాన్ చేస్తూ ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడ ఓ సమస్య కూడా ఉంది. మన తెలుగు నిర్మాతలు ఇక్కడ హీరోలు, డైరక్టర్ల రెమ్యునరేషన్స్ భరించలేకే పక్క చూపులు చూస్తున్నారట. అక్కడ కూడా ఇదే వ్యవహారం. మొత్తానికి ఈ కలయికలు ఇలా కలిశాయి. ఇంతకీ బాలయ్యతో లింగుస్వామి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.
Also Read:Naga Chaitanya Wedding: నాగచైతన్య పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలుసా ?