Prashanth Neel – NTR: ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో ఓ మూవీ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న సినిమా కథ గురించి తాజాగా ఒక అప్ డేట్ వినిపిస్తోంది. గతంలో పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందట. అయితే విచిత్రంగా ఎన్టీఆర్ ఒక పాకిస్థానీగా నటించబోతున్నాడని తెలుస్తోంది.
తన పూర్వికులు హిందువులు కావడం, తనకు ఇండియా అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండటం కారణంగా ఇండియా గెలుపు కోసం ఎన్టీఆర్ పాత్ర ఎలాంటి త్యాగం చేశాడనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. పైగా ఆ యుద్ధం నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించనున్నారు. ఈ సినిమా ఇండియాకే గర్వకారణంగా ఉంటుందట.
Also Read: Ram- Balakrishna: బాలయ్యకి సినిమాని సెట్ చేసిన హీరో రామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?
పైగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ వచ్చే ఏడాది దాదాపు 180 రోజుల పాటు బల్క్ డేట్స్ కేటాయించబోతున్నాడు. 2023లో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లినా.. అదే ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ షార్ప్ టేకింగ్ కి, టైట్ స్క్రీన్ ప్లేకి మధ్య జరిగిన సంఘర్షణ మయంగా మలచాలని పక్కా ప్లాన్ తో ఉన్నాడట.
సహజంగా ప్రతి సీన్ ను ఎమోషన్బ్ తో డ్రైవ్ చేయడం, పైగా ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం ప్రశాంత్ నీల్ స్టైల్. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని కూడా ప్రశాంత్ తన శైలిలోనే చేయబోతున్నాడు. మొత్తానికి ‘కేజీఎఫ్’ అనే ఒక్క సినిమాతోనే నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఫుల్ డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.
అందుకే, పాన్ ఇండియా రేంజ్ నిర్మాతలు కూడా ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి భారీ అడ్వాన్స్ లు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, ప్రశాంత్ నీల్ కి ఆల్ రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా నిర్మాణంలో దానయ్య కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Prabhas: ‘ప్రభాస్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రభాస్