Mahesh Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్..వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన అతడు మరియు ఖలేజా వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కాకపోయినప్పటికీ కూడా బుల్లితెర ద్వారా వేరే లెవెల్ రీచ్ ని సొంతం చేసుకున్నాయి..ఇప్పటికి కూడా ఈ సినిమాలు టీవీ లో వచ్చాయంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపొయ్యి మరి చూస్తారు..అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారు..ఇప్పుడు సుమారు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి..ఆగష్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు దర్శక నిర్మాతలు..ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.

ఇక ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నట్టు సమాచారం..ఇటీవల కాలం లో రాజకీయం అంటే జనాలతో బిజినెస్ చెయ్యడం లాంటిదిగా మారిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..అడుగడుగునా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన ఈ సమాజం లో రాజకీయం అంటే ఏమిటి..రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే కథాంశం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట..త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ మరియు కామెడీ టైమింగ్ కూడా ఈ చిత్రం లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది..ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో మరో యంగ్ హీరో కూడా నటించే సోక్ప్ ఉంది..ప్రస్తుతం ఆ పాత్ర కోసం దర్శక నిర్మాతలు అన్వేషిస్తున్నారు.
Also Read: Prabhas: ‘ప్రభాస్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రభాస్

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి మహేష్ బాబు అక్షరాలా 70 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది..ఒక ప్రాంతీయ సినిమాకి ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మొట్టమొదటి హీరో మహేష్ బాబు అవ్వడం విశేషం..ఇక త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి 30 నుండి 40 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది..కేవలం హీరో మరియు డైరెక్టర్ బడ్జెట్ 100 కోట్లు దాటిపోయింది..ఇక సినిమా పూర్తి అయ్యేసరికి ఎంత బడ్జెట్ అవుతుందో అని సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్నాయి.
Also Read:Naga Chaitanya Wedding: నాగచైతన్య పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలుసా ?