Homeఎంటర్టైన్మెంట్Hero Nikhil shocking comments : అమెరికా ప్రెసిడెంట్ కి తెలుగు హీరోకి...

Hero Nikhil shocking comments : అమెరికా ప్రెసిడెంట్ కి తెలుగు హీరోకి సంబంధం ఏమిటి ?

Nikhil comments on Joe BidenHero Nikhil shocking comments: హీరో నిఖిల్ (Hero Nikhil) రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోలానే సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ ఉంటాడు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ‘జో బిడెన్‌’ను చెప్పు తెగుద్ది వెధవ’ అంటూ తిట్టి నెటిజన్లకు షాక్ ఇచ్చాడు. అసలు ఈ తెలుగు హీరోకి అమెరికా ప్రెసిడెంట్ ను తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? అంటే…

అఫ్ఘానిస్తాన్‌ లో 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇరవై ఏళ్ళు పాటు ఏమీ చేయలేక తాలిబన్ల నుండి భయపడి పారిపోయింది అమెరికా సైన్యం. పైగా ఇప్పుడు అమెరికా తాలిబన్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం సిగ్గు చేటు అనే కోణంలో నిఖిల్ సంచలన పోస్ట్ ను పెట్టాడు.

నిఖిల్ ట్వీట్ చేస్తూ.. తాలిబన్లకు అమెరికా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ ? అని ప్రశ్నిస్తూ.. ఆవేశంలో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌ ను (Joe Biden) చెప్పు తెగుద్ది వెధవ’ అని తిడుతూ ఒక సంచలన ట్వీట్ ను పోస్ట్ చేశాడు. నిజానికి రాజకీయ నాయకులే ఎవరు ఈ రేంజ్ లో మరీ ఇంత దారుణంగా ‘జో బిడెన్‌’ను తిట్టింది లేదు.

అలాంటిది ఒక తెలుగు చిన్న హీరో ఈ రేంజ్ లో తిట్టడం షాకింగ్ విషయమే. అయితే, అమెరికా ప్రెసిడెంట్‌ ను చెప్పు తెగుద్ది వెధవ అని తిట్టడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అని నెటిజన్లు కొందరు నిఖిల్ కి వ్యతిరేఖంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా హీరో నిఖిల్ కి వినూత్నమైన సినిమాలు చేస్తాడనే మంచి పేరు ఉంది.

అయితే, ఈ హీరో ఇలా తనను తానూ కంట్రోల్ చేసుకుంటే మంచిది అంటూ నెటిజన్లు అతనికి సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. నిఖిల్ చేతిలో 18-పేజెస్, కార్తికేయ-2 సినిమాలతో పాటు మరో రెండు చిత్రాలు కూడా ఉన్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular