https://oktelugu.com/

Kiran Abbavaram Wedding Photos : ఘనంగా జరిగిన హీరో కిరణ్ అబ్బవరం వివాహం..వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

అందులో భాగంగానే ఆయన 'క' అనే పాన్ ఇండియన్ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2024 / 10:31 PM IST

    kiran

    Follow us on

    Kiran Abbavaram Wedding Photos : ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నేడు హీరోయిన్ రహస్య గోరఖ్ ని ఘనంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ ప్రేమ జంట నేడు మూడు ముళ్ళు, 7 అడుగులతో అగ్నిసాక్షిగా ఒక్కటి అయ్యారు. ఈ పెళ్ళికి సంబంధించిన వీళ్లిద్దరి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్న ఈ జంటకి సోషల్ మీడియా లో అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి ఒకేసారి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. ‘రాజా వారు రాణి వారు’ అనే చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటించగా, ఆ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. అంతే కాదు ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణ్ అబ్బవరమే అందించాడు. షూటింగ్ సమయం ఇద్దరు బాగా క్లోజ్ అవ్వడం, ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకోవడం తో మనసులు బాగా దగ్గరయ్యాయి. అలా వీళ్ళ మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి సుమారుగా 5 ఏళ్ళ పాటు డేటింగ్ చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు.

    ఇక వీళ్లిద్దరి కెరీర్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం కి రెండు, మూడు హిట్ సినిమాలు ఉండడంతో అతనికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అంతే కాదు ఇతనికి ఒక డిఫరెంట్ స్టైల్ నటన, డైలాగ్ డెలివరీ ఉండడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటూ ముందుకు పోతే ఈయన టాలీవుడ్ లో మరో నాని అవ్వగలడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక రహస్య గోరఖ్ విషయానికి వస్తే ఈమె నటన పరంగాను, అందం పరంగాను ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు. కానీ ఆమెకి సరైన సక్సెస్ లు దొరకకపోవడం వల్ల ఇంకా చిన్న హీరోయిన్ గానే కొనసాగుతుంది. అయితే పెళ్లి తర్వాత ఆమె జాతకం ఏమైనా మారుతుందో లేదో చూడాలి. కొంతమందికి పెళ్లి తర్వాత అన్నీ బాగా కలిసి వస్తుంటాయి. అందుకు ఉదాహరణగా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్లను చెప్పొచ్చు.

    వీళ్ళ కెరీర్స్ పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కి కూడా సరైన సక్సెస్ లు లేవు, పెళ్లి తర్వాత ఆయన రేంజ్ పెంచుకునేలా గ్రహాలు సహకరిస్తాయి లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా కిరణ్ అబ్బవరం గత రెండు చిత్రాలు మీటర్, రూల్స్ రంజన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ సినిమాలు అవ్వడంతో ఇక నుండి స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వెయ్యాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ‘క’ అనే పాన్ ఇండియన్ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.