Site icon OkTelugu

Bollywood back with Dhurandhar 2: ‘దురంధర్ 2’ తో బాలీవుడ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టేనా..?

Dhurandhar 2 Box Office Collection

Dhurandhar 2 Box Office Collection

Bollywood back with Dhurandhar 2: బాలీవుడ్ ఇండస్ట్రీ గా కొంతకాలంగా చాలా వరకు వెనుకబడిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న కూడా వాళ్ళ వల్ల కావడం లేదు. ఖాన్ త్రయం సైతం సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు హీరోల సినిమాల వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మన సినిమాలు చూడడానికి మన హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయంటూ వాళ్ళు చాలావరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు మన వాళ్ళు చేసిన సినిమాలు మనల్ని టాప్ పొజిషన్ కి తీసుకెళ్ళాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. గత సంవత్సరం రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ సినిమా 1300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘దురంధర్ 2’ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి.

మొదటి రోజు 100 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా మరింత కలెక్షన్స్ ను పెంచుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమా 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి లైమ్ లైట్ లోకి రాబోతుంది అంటూ చాలామంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరిన్ని సినిమాలను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తే బాలీవుడ్ మరోసారి తమ సత్తాను చాటుకున్న వాళ్ళవుతారు. లేకపోతే మాత్రం మరోసారి వరుస సినిమాలతో డిజాస్టర్లను అందించినట్లయితే మాత్రం పూర్తిగా తమ ఫామ్ ను కోల్పతారనే చెప్పాలి…ఇక మన సినిమాలు సైతం బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

తొందరలోనే మన స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయబోతున్నాయి. కాబట్టి ఈలోపు బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ అయితేనే వాళ్లకి క్రెడిబిలిటీ దక్కుతుంది. లేకపోతే మాత్రం ఉన్న క్రేజ్ మొత్తం మనవాళ్లు లాగేసుకునే అవకాశం కూడా లేకపోలేదు…

Exit mobile version