Chanakya Neeti Telugu : చాణక్య నీతి ప్రకారం.. ఇలాంటి అమ్మాయలను పెళ్లి చేసుకుంటే జీవితం నరకమే..!

చాణక్యుడు రాజనీతి శాస్త్ర బోధనలతో పాటు జీవితానికి సంబంధించిన విలువైన సూత్రాలను ప్రజలకు అందించారు. ముఖ్యంగా వివాహానికి సంబంధించి పురుషులు, మహిళలకు కొన్ని విలువైన విషయాలు చెప్పారు. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో అందానికి ఆకర్షితులు కావొద్దని, వారు చేసే పనులు.. పాటించే పద్దతుల ద్వారా వారి మంచితనాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు.

Written By: Chai Muchhata, Updated On : August 23, 2024 1:36 pm

Chanakya Neeti Telugu

Follow us on

Chanakya Neeti Telugu : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన దశ. ఒక వ్యక్తి అప్పటి వరకు అమ్మానాన్నల పై ఆధారడి… పెళ్లి తరువాత సొంత జీవితాన్ని మొదలు పెడుతారు. ఈ క్రమంలో ఆయన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారు. అయితే జీవితం రెండు భాగాలుగా విడదీస్తే.. పెళ్లయ్యే వరకు ఒక భాగం.. పెళ్లి తరువాత రెండో భాగం అనుకోవచ్చు. పెళ్లికి ముందు ఎలాగైన బతుకొచ్చు. కానీ పెళ్లి తరువాత జీవితం ఆనందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కొందరు పెళ్లి చేసుకునే క్రమంలో కొందరు అమ్మాయిలకు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా అందమైన అమ్మాయిల మాయలో పడి తలనొప్పి తెచ్చివారిని పెళ్లి చేసుకుంటారు. ఏ అమ్మాయి గురించి ముందుగా అంచనా వేయలేరు. కానీ కొన్ని విషయాల వల్ల ఆ అమ్మాయి గురించి తెలుసుకోవచ్చని అపరమేథావి చాణక్యుడు తెలిపారు. అదెలా తెలుసుకోవాలంటే?

చాణక్యుడు రాజనీతి శాస్త్ర బోధనలతో పాటు జీవితానికి సంబంధించిన విలువైన సూత్రాలను ప్రజలకు అందించారు. ముఖ్యంగా వివాహానికి సంబంధించి పురుషులు, మహిళలకు కొన్ని విలువైన విషయాలు చెప్పారు. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో అందానికి ఆకర్షితులు కావొద్దని, వారు చేసే పనులు.. పాటించే పద్దతుల ద్వారా వారి మంచితనాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు. కేవలం అందంగా ఉందని ఆకర్షితులై పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. అదే మంచి గుణం ఉన్న అమ్మాయిని కోరుకోవడం వల్ల ఆనందగా ఉంటారు. అయితే ఎటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు? వారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

కొందరు అమ్మాయిలు అందంగా ఉంటూ ఎదుటి వారిని ఆకర్షించే పనిలో మాత్రమే ఉంటారు. వారు ఇతర పనుల పట్ల శ్రద్ద చూపరు. ఇతరులు తమను చూస్తున్నారా? లేదా? అని నిత్యం గమనిస్తూ ఉంటారు. వీరిని పెళ్లి చేసుకుంటే కుటుంబ జీవితం కంటే తమ అందానికే ప్రాధాన్యం ఇస్తారు. దీంతో పురుషులు తీవ్ర నిరాశతో ఉంటారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి వారి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచింది.

కొందరు అమ్మాయిలు పదే పదే అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఇలాంటి వారు సంసార జీవితంలో కూడా అబద్దాలు చెప్పే అవకాశం ఉంటుంది. దీంతో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ అబద్ధం చెప్పినా ఆ తరువాత ప్రయాచ్చితపడేవారి గురించి ఆలోచించ వచ్చు. ఎందుకంటే తాము చెప్పిన అబద్ధం ద్వారా ఎంత నష్టం జరిగిందో గుర్తిస్తారు.

పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు పెద్దలు. అయితే కొందరు కుటుంబ సంగతి ఎలా ఉన్నా.. అమ్మాయి అందంగా ఉంటే వారిని పెళ్లి చేసుకోవాలని చూస్తారు. అయితే అలాంటి వారిని పెళ్లి చేసుకోవడం వల్ల రానున్న రోజులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పటికైనా అలాంటి కుటుంబలో ఉన్న అమ్మాయి మనసు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కుటుంబాల మధ్య చిచ్చులు పెరిగి జీవితం ఆందోళనకరంగా ఉంటుంది.