Site icon OkTelugu

Chiranjeevi comments at Gaddar Awards event: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడంలో వెనకబడింది..’గద్దర్ అవార్డ్స్’ వేడుకలో చిరంజీవి కామెంట్స్ !

Chiranjeevi comments at Gaddar Awards event

Chiranjeevi comments at Gaddar Awards event

Chiranjeevi comments at Gaddar Awards event: నిన్న హైదరాబాద్ లోని హైటెక్స్ లో 2025 వ సంవత్సరానికి గాను ‘గద్దర్ అవార్డ్స్ ‘ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ అవార్డ్స్ వేడుకకు సినీ పరిశ్రమ నుండి సెలబ్రిటీలంతా హాజరయ్యారు. 2025 వ సంవత్సరం లో అద్భుతమైన బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ చేసిన సినిమాలకు, అదే విధంగా ఆ సినిమాల్లో నటించిన నటీనటులకు ఈ గద్దర్ అవార్డ్స్ ని అందించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ వంటి వారు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు . అయితే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరంగా కూడా దుమారం రేపుతోంది.

ఆయన మాట్లాడుతూ ‘సినీ నటుల నటనకు ప్రోత్సాహం గా, వాళ్లకు ఎనలేని ఉత్సాహం అందాలంటే , ఇలాంటి అవార్డ్స్ కచ్చితంగా ఉండాలి. ఈమధ్య కాలం లో అవార్డ్స్ కి ప్రాధాన్యత మన రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి ఈ గద్దర్ అవార్డ్స్ ని తీసుకొని రావడం శుభ పరిణామం. ఆయనకు ఈ సందర్భంగా నా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం గారిని ఎప్పుడు కలిసినా మా చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించే మాట్లాడుతూ ఉంటారు. మన దేశ జీడీపీ పెరగడానికి చిత్ర పరిశ్రమ ఎంతో అవసరమని అంటుంటారు. మన దేశంలో సినీ పరిశ్రమ అంటే తెలంగాణ గుర్తుకు రావాలి అనేది ఆయన ఆకాంక్ష. అయితే కళాకారులను ఉత్సాహపర్చడం లో ఎందుకో పక్క రాష్ట్రము (ఆంధ్ర ప్రదేశ్) బాగా వెనకబడింది అనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు సినీ పరిశ్రమకు చాలా దగ్గరైన మనిషి , ఆయన దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలి , సినీ పరిశ్రమ అభివృద్ధి కి నా వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని సీఎం గారు గుర్తించినా, ఆ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి .

ఇలా పక్క రాష్ట్రాన్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఇప్పుడు అంత అవసరమా , లేనిపోనీ నెగెటివిటీ అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డ్స్ ని పునః ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధికారులు. ఒకప్పుడు నంది అవార్డ్స్ వేడుకని ఎంత గ్రాండ్ గా చేసేవారో మన అందరికీ తెలిసిందే. గత 8 ఏళ్ళ నుండి ఈ అవార్డ్స్ ఒకటి ఉండేది అనే విషయాన్ని కూడా మర్చిపోయారు జనాలు.

Exit mobile version